Tuesday, March 8, 2011

Avunu valliddaru istapaddaru (2002) - 3

పాట - 1

పల్లవి :
హాయ్ హాయ్ హాయ్ హాయ్
వెన్నెల్లో హాయ్ హాయ్
మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే
తప్పెట్లో హాయ్ హాయ్
ట్రంపెట్లో హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే
మే నెల్లో ఎండ హాయ్ ఆగస్ట్‌లో వాన హాయ్
జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్
హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలెందుకండి
వెన్నెల్లో హాయ్ హాయ్
మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే
తప్పెట్లో హాయ్ హాయ్
మే నెల్లో ఎండ హాయ్ ఆగస్ట్‌లో వాన హాయ్
జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్
హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలెందుకండి
చరణం : 1
కనుల ఎదుట కలల ఫలము నిలిచినది తందానా సుధ చిందేనా
కనులు కనని వనిత ఎవరో మనకు ఇక తెలిసేనా మది మురిసేనా
తనను ఇక ఎల్లాగైనా కళ్ళారా నే చూడాలి
పగలు మరి కల్లోనైనా ఎల్లోరాతో ఆడాలి
మధుర లలన మదన కొలనా కమల వదన అమల సదన
వదల తరమా మదికి వశమా చిలిపి తనమా
చిత్రమైన బంధమాయె అంతలోన
అంతులేని చింతన అంతమంటు ఉన్నదేనా
వెన్నెల్లో హాయ్ హాయ్
మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే
తప్పెట్లో హాయ్ హాయ్
మే నెల్లో ఎండ హాయ్ ఆగస్ట్‌లో వాన హాయ్
జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్
హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలెందుకండి
చరణం : 2
గదిని సగము పంచుకుంది ఎవరు అనుకోవాలి ఏం కావాలి
మదిని బరువు పెంచుకుంటూ ఎవరికే ం చెప్పాలి ఏం చేయాలి
అసలు తను ఎల్లావుందో ఏమి చేస్తుందో ఏమోలే
స్పెషలు మనిషైనా కూడ మనకేముంది మామూలే
కళలు తెలుసా ఏమో బహశా కవిత మనిషా కలల హంస
మనసు కొంచెం తెలుసుకుంది కలిసిపోయే మనిషిలాగ
మంచి పద్ధతంటూ ఉందిమదిని లాగుతున్నది
ఎంత ఎంత వింతగున్నదీ
వెన్నెల్లో హాయ్ హాయ్
మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే
తప్పెట్లో హాయ్ హాయ్
మే నెల్లో ఎండ హాయ్ ఆగస్ట్‌లో వాన హాయ్
జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్
హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలెందుకండి

చిత్రం : ఔను.. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002)
రచన : సాయి శ్రీహర్ష
సంగీతం, గానం : చక్రి
----
పాట - 2
పల్లవి :
రా రమ్మని రారా రమ్మని... రా రమ్మని రారా రమ్మని...
రామచిలుక పిలిచెను ఈ వేళ
అల్లరి వెల్లువగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా
ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు గొని పోనా
లే లెమ్మని లేలే లెమ్మని లేతగాలి తాకెను ఈ వేళ
మాటలకందని ఊసులతో మనసే నిండిన దోసిలితో
ప్రేమించుకోనా ప్రతిజన్మలో కొత్త జన్మందుకోనా నీ ప్రేమలో
విహరించనా నీ హృదయాలయంలో
రా రమ్మని రారా రమ్మని... రా రమ్మని రారా రమ్మని...
రామచిలుక పిలిచెను ఈ వేళ
చరణం : 1
పెదాల్లో ప్రథమ పదము నువ్వే ఎదల్లో తరగని గని నువ్వే
జగంలో అసలు వరము నువ్వే జనాల్లో సిసలు దొరవు నువ్వే
అణువణువున నాలో నువ్వే అమృతమే చిలికావే
అడుగడుగున నాతో నువ్వే అద్భుతమే చూపావే
నిజంలో నువ్వు నిదర్లో నువ్వు సదా నావెంట ఉండగా
ఇదేగా ప్రేమపండుగ...
రా రమ్మని రారా రమ్మని... రా రమ్మని రారా రమ్మని...
రామచిలుక పిలిచెను ఈ వేళ
చరణం : 2
ఫలించే పడుచు ఫలము నీకే బిగించే కౌగిలి గిలి నీకే
సుమించే సరస కవిత నీకే శ్రమించే చిలిపి చొరవ నీకే
ఎదిగొచ్చిన పరువం నీకే ఏదైనా నీకొరకే
నువు మెచ్చిన ప్రతిదీ నీకే నా యాతన నీకెరుకే
సమస్తం నీకు సకాలంలోన స్వయానా నేను పంచనా
సుఖిస్తాను నీ పంచన...
రా రమ్మని రారా రమ్మని... రా రమ్మని రారా రమ్మని...
రామచిలుక పిలిచెను ఈ వేళ
అల్లరి వెల్లువగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా
ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు గొని పోనా
లే లెమ్మని లేలే లెమ్మని లేతగాలి తాకెను ఈ వేళ
మాటలకందని ఊసులతో మనసే నిండిన దోసిలితో
ప్రేమించుకోనా ప్రతిజన్మలో కొత్త జన్మందుకోనా నీ ప్రేమలో
విహరించనా నీ హృదయాలయంలో...

చిత్రం : ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002)
రచన : చంద్రబోస్
సంగీతం : చక్రి
గానం : ఎస్.పి.బాలు, కౌసల్య
----
పాట - 3
పల్లవి :
నూజివీడు సోనియా ఆడుదామా దాండియా
నూజివీడు సోనియా ఆడుదామా దాండియా
అహ... బుంగమూతి పిల్లా నేనాగలేను మల్లా
చెరువుల్లో చేపపిల్లా నా మరదలు పిల్లా
నూజివీడు సోనియా ఆడుదామా దాండియా
నూజివీడు సోనియా ఆడుదామా దాండియా
చరణం : 1
హంసలా నువు పోతావుంటే... గుండె గుల్లయ్ పోయే పిల్లా
హంసలా నువు పోతావుంటే... గుండె గుల్లయ్ పోయే పిల్లా
నుడుము భలే నడక భలే ముద్దులగుమ్మా పుత్తడిబొమ్మా
స్టయిల్ భలే స్మయిలు భలే చక్కెరచుమ్మా చప్పున ఇమ్మా
బంగాళాఖాతంలో వాయుగుండమై నేనూ వ స్తను పిల్లో
తీరం దాటాకా ఆగమన్న ఆగలేను అత్తరు పిల్లో
నూజివీడు సోనియా ఆడుదామా దాండియా
నూజివీడు సోనియా ఆడుదామా దాండియా
చరణం : 2
కొంటెగా నువ్ చూశావంటే... కొంపమునిగిపోదా మల్లా
కొంటెగా నువ్ చూశావంటే... కొంపమునిగిపోదా మల్లా
దరికిరావే దొరికిపోవే పోకిరిపిల్లా మాపటికల్లా
మెరుపులాగ మెరిసిపోయే అల్లరిపిల్లా తొక్కుడుబిళ్ళా
నువ్వెసయ్యంటే ఆకసాన్ని ప్యాక్ చేసి తెస్తనెపిల్లా
రాములోరి గుడికాడ తాళిబొట్టు నీకు నేను కడతా పిల్లా
నూజివీడు సోనియా ఆడుదామా దాండియా
నూజివీడు సోనియా ఆడుదామా దాండియా
అహ... బుంగమూతి పిల్లా నేనాగలేను మల్లా
చెరువుల్లో చేపపిల్లా నా మరదలు పిల్లా
బుంగమూతి పిల్లా నేనాగలేను మల్లా
చెరువుల్లో చేపపిల్లా నా మరదలు పిల్లా
నూజివీడు సోనియా ఆడుదామా దాండియా
నూజివీడు సోనియా ఆడుదామా దాండియా

చిత్రం : ఔను...వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002)
రచన : భాస్కరభట్ల రవికుమార్
సంగీతం : చక్రి
గానం : రవివర్మ, బృందం

No comments:

Post a Comment