Tuesday, March 8, 2011

Aawara (2010) - 3

పాట - 1

పల్లవి :

అరెరే వాన జడివాన... అందాల నవ్వులే పూల వాన

అరెరే వాన జడివాన... అందాల నవ్వులే పూల వాన

మళ్లీమళ్లీ వానొస్తే మనసు గొడుగు చెలి పడితే

గారం పెరిగింది దూరం తరిగింది

ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది

నెమలికన్నులాగ చెలి నాట్యమాడుతుంటే

ఎదే పాలపుంతై నా మనసు నాడమంది

ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది

అరెరే వాన జడివాన... అందాల నవ్వులే పూల వాన

చరణం : 1

ఆటా పాటా ఓ పాడని పాట

వానే పాడింది అరుదైన పాట

నిన్ను నన్ను కలిపిన ఈ వానకొక్క సలామ్ కొట్టు

నేను తప్పిపోయాను నీలోన వెతికి పెట్టు

మంత్రంలాగ ఉంది ఇది తంత్రంలాగ ఉంది

చిత్రంగానే మదిలో ఒక యుద్ధం జరుగుతోంది

దేవత ఏది నా దేవత ఏది

తను సంతోషంగా ఆడుతూ ఉంది

చరణం : 2

నిన్ను మించి వేరెవరూ లేరే

నన్ను మించి నీకెవరూ లేరే

చిన్న చిన్న కళ్ళు రెండు దేవుడు నాకు ఇచ్చాడ ంట

కళ్లు రెండు మూసుకున్న నీవున్నదె మాయమట

మల్లెపూల పొద్దు నాకు ఇచ్చి పోవే ముద్దు

ముద్దుచాటు సద్దు చెరిపేయమంది హద్దు

పులకించింది ఎద పులకించింది

చెలి అందాలనే చిలికించింది

అరెరే వాన జడివాన... అందాల నవ్వులే అగ్గి వాన

అరెరే వాన జడివాన... అందాల నవ్వులే అగ్గి వాన

మళ్లీమళ్లీ వానొస్తే పగటి వేళ మెరుపొస్తే

నింగే వొంగింది భూమే పొంగింది

నా శ్వాస తగిలాకా వణుకు వేడి సోకింది

గొడుగు పట్టి ఎవరు ఈ వాననాపవద్దు

అడ్డమొచ్చి నా మనసునాపవద్దు

ఆడాలి ఆడాలి వానతో ఆడాలి


చిత్రం : ఆవారా (2010)

రచన : వెన్నెలకంటి

సంగీతం : యువన్‌శంకర్‌రాజా

గానం : రాహుల్ నంబియార్, సైంధవి

----

పాట - 2

పల్లవి :

చిరు చిరు చిరు చినుకై కురిసావే

మరుక్షణమున మరుగై పోయావే

నువ్వే ప్రేమబాణం నువ్వే ప్రేమకోణం

పువ్వై నవ్వగానే గాలై ఎగిరెను ప్రాణం

చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయము పలికినదే

సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే

ఎదనే నీతో ఎత్తుకెళ్లావే

చిరు చిరు చిరు చినుకై కురిసావే

మరుక్షణమున మరుగై పోయావే

చరణం : 1

దేవత... తనే ఒక దేవత

ముఖాముఖి అందమే చూడగా ఆయువే చాలునా

గాలిలో తనే కదా పరిమళం

చెలి సఖి అనుమతే అడగ కా పూవులే పూయునా

సిగలో కురులే మేఘాలల్లే ఆడే వేళా

గుండెల్లోన మెరుపే మెరిసే చూపే మైమరచే

చెలి చెక్కిళ్లే ముద్దుల్తోనే తడిమెయ్యాలా

చెంగు చెంగు అడుగుల్లోన మువ్వై మది మురిసే

ఎదనే తనతో ఎత్తుకెళ్లిందే

చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయము పలికినదే

సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే

చరణం : 2

తోడుగా ప్రతిక్షణం వీడక

అనుక్షణం ఆమెతో సాగనా ఆమె నా స్పందన

నేలపై పడేయక నీడనే

చకా చకా చేరనా ఆపనా గుండెలో చేర్చనా

దారం బదులు ప్రాయంతోటే కట్టేసిందే

గాయం లేక కోసేసిందే హాయిగా నవ్వేసిందే

నాలో నేను మౌనంగానే మాటాడేస్తే

మొత్తం తను వింటూవుందే తీయగా వేదిస్తుందే

ఎదనే తనతో ఎత్తుకెళ్లిందే

చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయము పలికినదే

సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే


చిత్రం : ఆవారా (2010)

రచన : చంద్రబోస్

సంగీతం : యువన్‌శంకర్‌రాజా

గానం : హరిచరణ్, తన్వి

----

పాట - 3

పల్లవి :

నీ ఎదలో నాకు చోటే వద్దు... నా ఎదలో చోటే కోరవద్దు

మన ఎదలో ప్రేమను మాటే వద్దు

ఇవి పైపైన మాటలులే...

నీ నీడై నడిచే ఆశ లేదే... నీ తోడై వచ్చే ధ్యాస లేదే

నీ తోటే ప్రేమ పోతేపోనీ... అని అబద్ధాలు చెప్పలేనులే

నీ జతలోన నీ జతలోన ఈ ఎండాకాలం నాకు వానాకాలం

నీ కలలోన నీ కలలోన మది అలలాగ చేరు ప్రేమ తీరం

నీ ఎదలో నాకు చోటే వద్దు... నా ఎదలో చోటే కోరవద్దు

మన ఎదలో ప్రేమను మాటే వద్దు

ఇవి పైపైన మాటలులే...

చరణం : 1

చిరుగాలి తరగంటి నీ మాటకే ఎద పొంగేను ఒక వెల్లువై

చిగురాకు రాగాల నీ పాటకే తనువూగేను తొలి పల్లవై

ప్రేమ పుట్టాక నా కళ్లలో దొంగచూపేదో పురివిప్పెనే

కొంచెం నటనున్నది కొంచె నిజమున్నది ఈ సయ్యాట బాగున్నది

నువు వల వేస్తే నువు వల వేస్తే

నా ఎద మారే నా కథ మారే

అరె ఇది ఏదో ఒక కొత్త దాహం అది పెరుగుతుంటే వీచే చెలి స్నేహం

చరణం : 2

ఒకసారి మౌనంగా నను చూడవే ఈ నిమిషమే యుగమౌనులే

నీ కళ్లలో నన్ను బంధించవే ఆ చెర నాకు సుఖమౌనులే

నిన్ను చూసేటి నా చూపులో కరిగే ఎన్నెన్ని మునిమాపులో

పసిపాపై ఇలా నా కనుపాపలే నీ జాడల్లో దోగాడెనే

తొలి సందెలలో తొలి సందెలలో ఎరుపే కాదా నీకు సిందూరం

మలి సందెలలో మలి సందెలలో నీ పాపిటిలో ఎరమ్రందారం

నీ ఎదలో నాకు చోటే వద్దు... నా ఎదలో చోటే కోరవద్దు

మన ఎదలో ప్రేమను మాటే వద్దు

ఇవి పైపైన మాటలులే...

నీ నీడై నడిచే ఆశ లేదే... నీ తోడై వచ్చే ధ్యాస లేదే

నీ తోటే ప్రేమ పోతేపోనీ... అని అబద్ధాలు చెప్పలేనులే


చిత్రం : ఆవారా (2010)

రచన : వెన్నెలకంటి

సంగీతం, గానం : యువన్‌శంకర్‌రాజా

No comments:

Post a Comment