Tuesday, March 8, 2011

Athadu (2005) - 3

పాట - 1

అదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే

తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే

తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే

అతడే... అతడే... అతడే...

ఎవరిని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే

పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే

పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే

Life has made it stronger

It made him work a bit harder

He got to yhink and act a little wiser

This world has made him a fighter

కాలం నను తరిమిందో శూలంలా ఎదిరిస్తా

సమయం సరదా పడితే సమరంతో గెలిచేస్తా

నే ఫెళ ఫెళ ఉరుమై ఉరుముతు

జిగి ధగ ధగ మెరుపై వెలుగుతు

పెను నిప్పై నివురును చీల్చుతు

జడివానై నే కలబడతా...

పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే

చూట్టూ చీకటి ఉన్నా వెలిగే కిరణం అతడు

తెగపడే అల ఎదురైతే తలపడే తీరం అతడు

పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే

తన ఎదలో పగ మేల్కొలుపుతు

ఒది దుడుకులు వల ఛేదించుతు

ప్రతినిత్యం కథనం జరుపుతు

చెలరేగే ఓ శరమతడు...

Life started to be faster

made him had a little think smoother

He's living on the edge to be smarter

This world has made him a fighter


చిత్రం : అతడు (2005)

రచన, గానం: విశ్వ

సంగీతం : మణిశర్మ

----

పాట - 2

పల్లవి :

నీతో చెప్పనా... నీక్కూడా తెలిసినా

నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా

గారం చేసినా... నయగారం చూపినా...

కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా

నేనే నేనుగా... లేనే లేనుగా... ఆ....

నా కన్నులా... నీదే వెన్నెలా... ఓ...

నీతో చెప్పనా... నీక్కూడా తెలిసినా

నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా

చరణం : 1

ఇంకొంచెం అనుకున్నా ఇకచాల్లే అన్నానా

వదలమంటే ఏమిటర్థం వదిలి పొమ్మనా

పనిమాలా పైపైనా పడతావే పసికూన

ముద్దు మీరుతున్న పంతం హద్దులోనె ఆపనా

మగువ మనసు తెలిసేనా మగజాతికీ

మొగలిమొనలు తగిలేనా లేతసోయగానికి కూత దేనికి

గారం చేసినా... నయగారం చూపినా...

కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా

చరణం : 2

ఒదిగున్న ఒరలోన కదిలించకే కురద్రానా

కత్తిసాముతో ప్రమాదం పట్టు జారెనా

పెదవోపని పదుైనె నా ఫరవాలేదనుకోనా

కొత్త ప్రేమలో వినోదం నీకు నేను నేర్పనా

సొంత సొగసు బరువేనా సుకుమారికీ

అంత బిరుసు పరువేనా రాకుమారుడంటి నీ రాజసానికి

గారం చేసినా... నయగారం చూపినా...

కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా

నేనే నేనుగా... లేనే లేనుగా... ఆ....

ఓ... నా కన్నులా... నీదే వెన్నెలా... ఓ...


చిత్రం : అతడు (2005)

రచన : సిరివెన్నెల

సంగీతం : మణిశర్మ

గానం : ఎస్.పి.బాలు, చిత్ర

----

పాట - 3

పల్లవి :

అవును నిజం నువ్వంటే నాకిష్టం

ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం

చలి పరదా ఇక నిలవదుగా

తెలుసు కదా... ఆ... ఆ... ఆ...

తెలిసిందే అడగాలా అడగందే అనవేలా

చెవిలో ఇలా చెబితే చాలా

అవును నిజం నువ్వంటే నాకిష్టం

ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం

చరణం : 1

కసిరేస్తున్నా మనసుకి వినపడదో ఏమో

విసిరేస్తున్నా నిను విడి వెనుకకు రాదేమో

నిదరోతున్నా ఎదురై కనబడతావేమో

కదలాలన్నా కుదరని మెలి పెడతావేమో

అంతగా కంట చూడనని మొండికేస్తే తప్పేమో

ఒంటిగా ఉండనీయనని ముందుకొస్తే ముప్పేమో

మన సలహా మది వినదు కదా

తెలుసు కదా... ఆ... ఆ... ఆ...

తెలిసే ఇలా చెలరేగాలా

అవును నిజం నువ్వంటే నాకిష్టం

ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం

చరణం : 2

సుడిగాలిలో తెలియని పరుగులు తీస్తున్నా

జడపూలతో చెలిమికి సమయము దొరికేనా

ఎదరేముందో తమరిని వివరములడిగానా

ఎద ఏమందో వినమని తరుముకు రాలేనా

తప్పుకో కళ్ళు మూసుకుని తుళ్ళి రాకే నా వెంటా

ఒప్పుకో నిన్ను నమ్మమని అల్లుకుంటా నీ జంటా

నడపదుగా నిను నది వరదా

తెలుసు కదా... ఆ... ఆ... ఆ...

తెలిసే ఇలా ముంచెయ్యాలా

అవును నిజం నువ్వంటే నాకిష్టం

ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం

చలి పరదా ఇక నిలవదుగా

తెలుసు కదా... ఆ... ఆ... ఆ...

తెలిసిందే అడగాలా అడగందే అనవేలా

చెవిలో ఇలా చెబితే చాలా


చిత్రం : అతడు (2005)

రచన : సిరివెన్నెల

సంగీతం : మణిశర్మ

గానం : కె.కె., సునీత

No comments:

Post a Comment