Tuesday, March 8, 2011

Ashtachemma (2008) - 2

పాట - 1

పల్లవి :

ఆడించి అష్టాచమ్మా ఓడించావమ్మా... నీ పంట పండిందే ప్రేమా

నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే

ఆ మాటె అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా

నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే

ఆడించి అష్టాచమ్మా ఓడించావమ్మా... నీ పంట పండిందే ప్రేమా

నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే

ఆ మాటె అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా

నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే

చరణం : 1

ఓ.. ఓ.. ఊరంతా ముంచేస్తూ హంగామా చేస్తావేంటే గంగమ్మా

ఉఁ.. ఉఁ.. ఘోరంగా నిందిస్తూ ఈ పంతాలెందుకు చాల్లే మంగమ్మా

చూశాక నిన్ను-వేశాక కన్ను వెనక్కెలాగ తీసుకొనూ

ఏం చెప్పుకోను ఎటు తప్పుకోను నువ్వొద్దన్నా నేనొప్పుకోను

నువ్వేసే గవ్వలాటలో.. నిలేసే గళ్ళ బాటలో..

నీ దాకా నన్ను రప్పించ్చింది నువ్వే లేవమ్మా

నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే

చరణం : 2

ఓ.. ఓ.. నా నేరం ఏఁవుందే ఏం చెప్పిందో నీ తల్లో జేజెమ్మా

ఉఁ.. ఉఁ.. మందారం అయ్యింది ఆ రోషం తాకి జళ్ళో జాజమ్మా

పూవ్వంటీ రూపం నాజుగ్గా గిల్లీ కెవ్వంది గుండె నిన్న దాకా

ముళ్ళంటీ కోపం ఒళ్ళంతా అల్లీ నవ్వింది నేడు ఆగలేక

మన్నిస్తే తప్పేం లేదమ్మా మరీ ఆ మారం మానమ్మా

ఈ లావాదేవిలేవీ అంత కొత్తేం కాదమ్మా


చిత్రం : అష్టాచమ్మా (2008)

రచన : సిరివెన్నెల

సంగీతం : కళ్యాణి మాలిక్

గానం : శ్రీకృష్ణ

----

పాట - 2

పల్లవి :

హల్లో అంటూ పిలిచి కల్లోలం కలిగించి ఇల్లా రప్పించావే నన్నాకర్షించి

అందుకు నీదే పూచి... ఎందుకు నీతో పేచి

ఇచ్చేదేదో ఇచ్చి... వచ్చెయ్ నాతో రాజీ

కోలకంటి చూపా కొత్త ఏటి చేపా

పూలవింటి తూపా తాళవా ప్రతాపా

బెదరకే పాపా... వదలని కైపా

నువు కనపడి కలవరపడి తెగ ఎగసిన మగ మనసిది వాలిందే నీపై ఎగిరొచ్చి

నేనేగా ఆపా ఎదురొచ్చి...కీడించి మేలించి

హల్లో అంటూ పిలిచి కల్లోలం కలిగించి ఇల్లా రప్పించావే నన్నాకర్షించి

చరణం : 1

ఆరాతీసేవాళ్ళు పారా కాసేవాళ్ళూ దారంతా ఉంటారు ఔరా జాగ్రత్త

ఎందరినేమారుస్తాం... ఇంద్రజాలం చేస్తాం

తిమ్మిని బమ్మిని చేద్దాం... మన్మథ మంత్రం వేద్దాం

రేయిలాంటి మైకం కప్పుకొని ఉందాం

మాయదారి లోకం కంట పడదందాం

మన ఏకాంతం... మనకే సొంతం

అష్ట దిక్కులన్ని దుష్ట శక్తులల్లే కట్టకట్టుకొచ్చి

చుట్టుముట్టుకుంటే యుద్ధానికి సిద్ధం అనుకుందాం

పద్నాలుగు లోకాలను మొత్తం... ముద్దుల్లో ముంచేద్దాం

ఆరాతీసేవాళ్ళు పారా కాసేవాళ్ళూ దారంతా ఉంటారు ఔరా జాగ్రత్త

చరణం : 2

పిల్లకి మెళ్ళో పుస్తే కట్టేదెప్పుడంట పిల్లికి మెళ్ళొ గంట కట్టేదెవరంట

చప్పున చెప్పవె చిట్టీ... చంపకు ఊదరగొట్టి

దగ్గిర దగ్గిర ఉండి... తగ్గదు బాదర బంది

ఆవురావురందీ ఆకలాగనంది ఆవిరెక్కువుంది అంటుకోకు అందీ

తట్టుకోడమెల్లా... ముట్టుకుంటే డిల్లా

విస్తరాకు నిండ విస్తరించి ఉన్న నిన్ను చూసి కూడా

పస్తులుండమని ఎవ్వరిది శాసించిన పాపం

ఎవ్వరిపై చూపిస్తాం కోపం అయినా పెడతా శాపం

హల్లో అంటూ పిలిచి కల్లోలం కలిగించి ఇల్లా రప్పించావే నన్నాకర్షించి

అందుకు నీదే పూచి... ఎందుకు నీతో పేచి

ఇచ్చేదేదో ఇచ్చి... వచ్చెయ్ నాతో రాజీ

కోలకంటి చూపా కొత్త ఏటి చేపా

పూలవింటి తూపా తాళవా ప్రతాపా

బెదరకే పాపా... వదలని కైపా

నువు కనపడి కలవరపడి తెగ ఎగసిన మగ మనసిది వాలిందే నీపై ఎగిరొచ్చి

నేనేగా ఆపా ఎదురొచ్చి... కీడించి మేలించి

హల్లో అంటూ పిలిచి కల్లోలం కలిగించి ఇల్లా రప్పించావే నన్నాకర్షించి


చిత్రం : అష్టాచమ్మా (2008)

రచన : సిరివెన్నెల

సంగీతం : కళ్యాణి మాలిక్

గానం : శ్రీకృష్ణ, సుష్మా

No comments:

Post a Comment