Friday, March 4, 2011

Adavari matalaku ardhale verule (2007) - 3

పాట - 1

పల్లవి :

ఏమైందీ ఈ వేళా ఎదలోఈసందడేలా

మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయువేళా

చెలి కులుకులు చూడ పల్లవి :

ఏమైందీ వేళా ఎదలోఈసందడేలా

మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయువేళా

చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేలా

శిల్పి చెక్కెనీ శిల్పం సరికొత్తగా ఉంది రూపం

కనురెప్ప వేయనీదు అందం

మనసులోన వింతమోహం

మరువలేని ఇంద్రజాలం వానలోన ఇంత దాహం

చరణం : 1

చినుకులలో వానవిల్లూ నేలకిలా జారెనే

తళుకుమనే ఆమె ముందూ వెలవెల వెలబోయెనే

తన సొగసే తీగలాగ నా మనసే లాగెనే

అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగెనే

నిశీధిలో ఉషోదయం ఇవాళిలా ఎదురే వస్తే

చిలిపి కనులు తాళమేసే చినుకు తడిపి చిందులేసే

మనసు మురిసి పాట పాడే తనువు మరిచి ఆటలాడే

ఏమైందీ వేళా ఎదలో సందడేలా

మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయు వేళా

చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేలా

చరణం : 2

ఆమె అందమే చూస్తే మరి లేదు లేదు నిదురింకా

ఆమె నన్నిలా చూస్తే ఎద మోయలేదు పులకింత

తన చిలిపి నవ్వుతోనే పెను మాయ చేసేనా

తన నడుము ఒంపులోనే నెలవంక పూచెనా

కనుల ఎదుటే కలగ నిలిచా

కలలు నిజమై జగ ము మరిచా

మొదటిసారి మెరుపు చూశా కడలిలాగే ఉరకలేశా


చిత్రం : ఆడవారి మాటలకు అర్థాలే వేరులే(2007)

రచన : కులశేఖర్

సంగీతం : యువన్శంకర్రాజా

గానం : ఉదిత్ నారాయణ్

----

పాట - 2

పల్లవి :

నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి

నిలిచావే ప్రేమను పంచి... ...

నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి

నిలిచావే ప్రేమను పంచి... ...

నా వయసుకి వంతెన వేసి నా వలపుల వాకిలి తీసి

మది తెరితెరిచీ ముగ్గే పర చి ఉన్నావు లోకం మరిచి

నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి

నిలిచావే ప్రేమను పంచి... ...

చరణం : 1

నీ చూపుకి సూర్యుడు చలువాయే

నీ స్నర్శకి చంద్రుడు చెమటాయే

నీ చొరవకి నీ చెలిమికి మొదలాయే మాయే మాయే

నీ అడుగుకు ఆకులు పూవులాయే

నీ కులుకికి కాకులు వులాయే

నీ కళలకి నీ కథలకి కాదలాడే హాయే హాయే

అందంగా నన్నే పొగిడి అటుపైనా ఎదో అడిగి

నా మనసునే ఒక సరస్సులో అలజడులే సృష్ట్టించావే

నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి

నిలిచావే ప్రేమను పంచి... ...

చరణం : 2

ఒకమాట ప్రేమగా పలకాలే

ఒక అడుగు జతపడి నడవాలే

గురుతులు నా గుండెలో ప్రతిజన్మకు పదిలం పదిలం

ఒకసారి ఒడిలో ఒదగాలే ఎదపైనా నిదరేపోవాలే

తియతీయని నీ స్మృతులతో బతికేస్తా నిమిషం నిమిషం

నీ ఆశలు గమనించాలి నీ ఆర్తుత గుర్తించాలి

ఎటు తేలకా బదులీయకా మౌనంగా చూస్తుండాలి


చిత్రం : ఆడవారి మాటలకు అర్థాలే వేరులే (2007)

రచన : చంద్రబోస్

సంగీతం : యువన్శంకర్రాజా

గానం : కార్తీక్, గాయత్రి

----

పాట - 3

పల్లవి :

అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచిందా తీరుగా

అరుదైన చిన్నారిగా

కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా

భూమి నలేదు ఇన్నాళ్ళుగా ఈమెలా ఉన్న పోలిక

అరుదైనా చిన్నారిగా

కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా

అల్లంత దూరాల తారక

కళ్ళెదుట నిలిచిందా తీరుగా

చరణం : 1

కన్యాదానంగా సంపద చేపట్టే వరుడు శ్రీహరి కాడా

పొందాలనుకున్నా పొందే వీలుందా అందరికి అందనిదీ.. సుందరి నీడ

ఇందరి చేతులు పంచిన మమత పచ్చగా పెంచిన పూలతో

నిత్యం విరిసే నందనమవదా

అందానికే అందం అనిపించగా

దిగివచ్చినొ ఏవో దివి కానుక

అరుదైనా చిన్నారిగా కోవెల్లో

దేవేరిగా గుండెల్లో కొలువుండగా

చరణం : 2

తన వయ్యారంతో చిన్నది లాంగిదోయ్ ఎందరిని నిలబడనీకా

ఎన్నో ఒంపులతో పొంగే నది తనే మదిని ముంచిందో ఎవరికి ఎరుకా

తొలిపరిచయమొక తియ్యని కలగా

నిలిపిన హృదయమే సాక్షిగా

ప్రతి జ్ఞాపకం దీవించగా చెలి జీవితం వెలిగించగా...

అల్లంత దూరాల తారక

కళ్ళెదుట నిలిచిందా తీరుగా

అరుదైన చిన్నారిగా

కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా


చిత్రం : ఆడవారి మాటలకు అర్థాలే వేరులే (2007)

రచన : సిరివెన్నెల

సంగీతం : యువన్శంకర్రాజా

గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

No comments:

Post a Comment