Tuesday, March 15, 2011

Chakrapani (1954) - 1

పాట - 1

పల్లవి :

ఉయ్యాల జంపాలలూగ రావయా

ఉయ్యాల జంపాలలూగ రావయా

తులలేని భోగాల తూగి...

ఉయ్యాల జంపాలలూగ రావయా

తులలేని భోగాల తూగి...

ఉయ్యాల జంపాలలూగ రావయా

చరణం : 1

తాతయ్య సిరులెల్ల వేగరప్పింప

జాబులో పుట్టిన బాబు నీవయ్యా

జాబులో పుట్టిన బాబు నీవయ్యా

ఉయ్యాల జంపాలలూగ రావయా

చరణం : 2

మా మనోరమక్కాయి మదిలోన మెరసి

ఎదురింటి ఇల్లాలి ఒడిలోన వెలసి

ఎత్తుకొని ముత్తాత ఎంతెంతో మురిసి

ఎత్తుకొని ముత్తాత ఎంతెంతో మురిసి

నా వారసుడ అంటూనవ్వు రా కలసి

నా వారసుడ అంటూ నవ్వు రా కలసి

ఉయ్యాల జంపాలలూగ రావయా

తులలేని భోగాల తూగి...

ఉయ్యాల జంపాలలూగ రావయా

చరణం : 3

మా మదిలో కోర్కెలను మన్నింప దయతో

అవతరించినావయ్యా అందాలరాశి

చిన్ని నా తండ్రికి శ్రీరామరక్ష

చిన్ని నా తండ్రికి శ్రీరామరక్ష

తప్పక ఇచ్చురా తాతయ్య లక్ష

తప్పక ఇచ్చురా తాతయ్య లక్ష

ఉయ్యాల జంపాలలూగ రావయా

తులలేని భోగాల తూగి...

ఉయ్యాల జంపాలలూగ రావయా


చిత్రం : చక్రపాణి (1954)

రచన : రావూరి

సంగీతం, గానం : భానుమతి

No comments:

Post a Comment