Tuesday, March 15, 2011

Chairman chalamayya (1974)- - 1

పాట - 1
సలీల్ చౌధురి
పల్లవి :

హాయి హాయి ఎంత హాయి

ముద్దు ముచ్చట్లు మురిపించెనోయి

మల్లెలాంటి మనసు పొంగేనులే

ఆహాఁ... అల్లిబిల్లి ఊసులాడే

హేహే... పెద్దబస్తీల గోరింక మావంక తిరిగే

చిలక ఏమన్నది చేర రమ్మన్నది

స్నేహాలు మోహాలు గోరింక సొమ్మన్నది

హాయి హాయి ఎంత హాయి

ముద్దు ముచ్చట్లు మురిపించెనోయి

చరణం : 1

ఏ... ఆనాడు చేసేవు బాస

అనుబంధాల పెంచేవు ఆశ

ఇక ఈనాడు ఏనాడు నాతోడు నాజోడు ఓ రాజా నావాడు నీవే

హేహే... నీతోనే ఉంటాను నీలోనే ఉంటాను

నిగనిగ సొగసుల నిలిచెదను

ఈ లోకమేమనుకోనీ

ఎదలో మెదిలే వెలిగే వలపు నేనే

హాయి హాయి ఎంత హాయి

ముద్దు ముచ్చట్లు మురిపించెనోయి

చరణం : 2

హేహే... దోబూచులాడెను సొగసు

నను ఊరించసాగెను వయసు

ఇక నీ ఇంపు నీ సొంపు నీ నీటు నీ గోటు రాగాలు భోగాలు నావే

హేహే... నా నోము పండేను నీ మోజు తీరెను

నవ్వుల పువ్వులు మన కలలు... ఈ లోకమేమనుకోనీ

ఇలలో కలలో ఎడమే మనకు లేదు

హాయి హాయి ఎంత హాయి

ముద్దు ముచ్చట్లు మురిపించెనోయి

మల్లెలాంటి మనసు పొంగేనులే

ఆహాఁ... అల్లిబిల్లి ఊసులాడే

హేహే... పెద్దబస్తీల గోరింక మావంక తిరిగే

చిలక ఏమన్నది చేర రమ్మన్నది

స్నేహాలు మోహాలు గోరింక సొమ్మన్నది

హాయి హాయి ఎంత హాయి

ముద్దు ముచ్చట్లు మురిపించెనోయి


చిత్రం : చైర్మన్ చలమయ్య (1974)

రచన : ఆరుద్ర

సంగీతం : సలీల్ చౌధురి

గానం : ఎస్.జానకి, రామకృష్ణ

No comments:

Post a Comment