Monday, March 14, 2011

Bratukuteruvu (1953) - 1

పాట - 1
పల్లవి :

అందమె ఆనందం...

అందమె ఆనందం... ఆనందమె జీవిత మకరందం

అందమె ఆనందం... ఆనందమె జీవిత మకరందం

అందమె ఆనందం...

చరణం : 1

పడమటి సంధ్యారాగం... కుడి ఎడమల కుసుమపరాగం

పడమటి సంధ్యారాగం... కుడి ఎడమల కుసుమపరాగం

ఒడిలో చెలి మోహనరాగం... ఒడిలో చెలి మోహనరాగం...

జీవితమే మధురానురాగం... జీవితమే మధురానురాగం...

అందమె ఆనందం... ఆనందమె జీవిత మకరందం

అందమె ఆనందం...

చరణం : 2

పడిలేచే కడలితరంగం ఓ.... పడిలేచే కడలితరంగం

వడిలో జడసిన సారంగం

పడిలేచే కడలితరంగం... వడిలో జడసిన సారంగం

సుడిగాలలో ఓ.... సుడిగాలలో ఎగిరే పతంగం

జీవితమే ఒక నాటకరంగం... జీవితమే ఒక నాటకరంగం...

అందమె ఆనందం... ఆనందమె జీవిత మకరందం

అందమె ఆనందం... ఓ ఓ ఓ...


చిత్రం : బ్రతుకుతెరువు (1953)

రచన : సముద్రాల జూనియర్

సంగీతం, గానం : ఘంటసాల

No comments:

Post a Comment