Monday, March 14, 2011

Bobbili raja (1990) - 1

పాట - 1
పల్లవి :

ఊ... ఊ... ఊ... ఊ...

చం చక్ చం చక్ చం చం...

కన్యాకుమారి కనబడదా దారి

కయ్యాలమారి పడతావే జారి

పాతాళం కనిపెట్టేలా ఆకాశం పనిట్టేలా

ఊగకే మరి మతిలేని సుందరి

జింగ్ చక్ చం... జింగ్ చక్ చాం...

గోపాలబాలా ఆపర ఈ గోల

ఈ కైపు ఏలా ఊపర ఉయ్యాల

మైకంలో మయసభ చూడు

మహరాజా రానా తోడు

సాగనీమరి సరదాల గారడీ

జింగ్ చక్ జింగ్ చక్ చా... జింగ్ చక్ జింగ్ చక్ చా...

చరణం : 1

కొండలు గుట్టలు చిందులాడే తధిగిణతోం

వాగులు వంకలు ఆగి చూసే కథ చెబుదాం

తూనీగ రెక్కలెక్కుదాం సూరీడు పక్క నక్కుదాం

భూదేటి కొమ్ము వెతుకుదాం బంగారు జింకనడుగుదాం

చూడమ్మా... హంగామా...

అడివంతా రంగేద్దాం సాగించే వైరైటీ ప్రోగ్రాం

కళ్ళవిందుగా పైత్యాల పండగ అహ... హా...

జింగ్ చక్ జింగ్ చక్ చాం... జింగ్ చక్ జింగ్ చక్ చాం...

కన్యాకుమారి కనబడదా దారి

కయ్యాలమారి పడతావే జారి

మైకంలో మయసభ చూడు

మహరాజా రానా తోడు

జింగ్ చక్ జింగ్ చక్ చాం... జింగ్ చక్ జింగ్ చక్ చాం...

చరణం : 2

డేగతో ఈగలు ఫైటు చేసే చెడుగుడులో

చేపలే చెట్టుపై పళ్ళు కోసే గడబిడలో

నేలమ్మా తప్పతాగెనో ఏ మూలా తప్పిపోయెనో

మేఘాల కొంగు పట్టుకో తూలేటి నడకనాపుకో

ఓయమ్మో... మాయమ్మో...

దిక్కుల్నే ఆటాడించే చిక్కుల్లో గందరగోళం

ఒళ్ళు ఊగగా ఎక్కిళ్ళు రేగగా

జింగ్ చక్ జింగ్ చక్ చాం... జింగ్ చక్ జింగ్ చక్ చాం...

గోపాలబాలా ఆపర ఈ గోల

ఈ కైపు ఏలా ఊపర ఉయ్యాల.

పాతాళం కనిపెట్టేలా ఆకాశం పనిట్టేలా

ఊగకే మరి మతిలేని సుందరి

జింగ్ చక్ జింగ్ చక్ చాం...

జింగ్ చక్ జింగ్ చక్ చాం...

సాగనీమరి సరదాల గారడీ

జింగ్ చక్ జింగ్ చక్ చా... జింగ్ చక్ జింగ్ చక్ చా...


చిత్రం : బొబ్బిలిరాజా (1990)

రచన : సిరివెన్నెల

సంగీతం : ఇళయరాజా

గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

No comments:

Post a Comment