Friday, March 11, 2011

Bangaru thimmaraju (1964) - 2

పాట - 1
కె.జె.ఏసుదాస్
పల్లవి :

ఓ నిండు చందమామనిగనిగ లా భామా

ఒంటరిగా సాగలేవు కలసిమెలసి పోదామా

ఓ... ఓ... నిండు చందమామ

చరణం : 1

నిదురరాని తీయని రేయి... నిను పిలిచెను వలపుల హాయి

మధురమైన కలహాలన్నీ... మనసుపడే ముచ్చటలాయె

నిదురరాని తీయని రేయి... నిను పిలిచెను వలపుల హాయి

మధురమైన కలహాలన్నీ... మనసుపడే ముచ్చటలాయె

మేలుకొన్న స్వప్నములోన... ఏల ఇంత బిడియపడేవు

మేలుకొన్న స్వప్నములోన... ఏల ఇంత బిడియపడేవు

ఏలుకొనే ప్రియుడను కానా... లాలించగ సరసకు రానా

ఓ... ఓ... నిండు చందమామ

చరణం : 2

దోరవయసు ఊహలు నీలో... దోబూచులు ఆడసాగే

కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే

దోరవయసు ఊహలు నీలో... దోబూచులు ఆడసాగే

కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే

నీదు మనసు నీలో లేదు... నాలోనె లీనమయే

నీదు మనసు నీలో లేదు... నాలోనె లీనమయే

నేటినుంచి మేనులు రెండూ... నెరజాణా ఒకటాయె

ఓ... ఓ... నిండు చందమామ


చిత్రం : బంగారు తిమ్మరాజు (1964)

రచన : ఆరుద్ర

సంగీతం : ఎస్.పి.కోదండపాణి

గానం : కె.జె.ఏసుదాస్

(గమనిక : తెలుగులో జేసుదాస్ తొలి పాట)

----

పాట - 2

పల్లవి :

నాగమల్లి కోనలోన నక్కింది లేడికూన

నాగమల్లి కోనలోన నక్కింది లేడికూన

ఎరవేసి... హ... గురిచూసి... హ...... పట్టాలి మావా...

ఎరవేసి గురిచూసి పట్టాలి మావా... పట్టాలి మావా...

చరణం : 1

చూపుల్లో కైపుంది మావా సొగసైన రూపుంది మావా

చూపుల్లో కైపుంది మావా సొగసైన రూపుంది మావా

వయ్యారం ఒలికిస్తుంది

వన్నెలు చిన్నెలు నేర్చింది

ఓ ఉడుకుమీద ఉరికావంటే జడుసుకుంటది

దాన్ని ఒడుపుచూసి మచ్చిక చేస్తే వదలనంటది మావోయ్...

నాగమల్లి కోనలోన నక్కింది లేడికూన

ఎరవేసి... హ... గురిచూసి... హ...

పట్టాలి మావా... పట్టాలి మావా...

చరణం : 2

నడకల్లో హొయలుంది మావా... నాట్యంలో నేర్పుంది మావా

నడకల్లో హొయలుంది మావా... నాట్యంలో నేర్పుంది మావా

మలిసందె చీకట్లోన నీటికి ఏటికి వస్తుంది

ఓ జాడ చూసి కాశావంటే దారికొస్తది

దాని జాలి చూపు నమ్మావంటే దగా చేస్తది మావోయ్

నాగమల్లి కోనలోన నక్కింది లేడికూన

ఎరవేసి... హ... గురిచూసి... హ... పట్టాలి మావా...

ఎరవేసి గురిచూసి పట్టాలి మావా... పట్టాలి మావా...


చిత్రం : బంగారు తిమ్మరాజు (1964)

రచన : వీటూరి

సంగీతం : ఎస్.పి.కోదండపాణి

గానం : జమునారాణి

No comments:

Post a Comment