Friday, March 11, 2011

Badi Pantulu (1972) - 2

పాట - 1

పల్లవి :

భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు

భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు

ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు

ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు

భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు ఆ... ఆ... ఆ.....

చరణం : 1

త్రివేణి సంగమ పవిత్ర భూమి

నాల్గు వేదములు పుట్టిన భూమి

గీతామృతమును పంచిన భూమి

పంచశీల బోధించిన భూమి... పంచశీల బోధించిన భూమి

భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు

చరణం : 2

శాంతిదూతగా వెలసిన బాపూ

జాతిరత్నమై వెలిగిన నెహ్రూ

శాంతిదూతగా వెలసిన బాపూ

జాతిరత్నమై వెలిగిన నెహ్రూ

విప్లవవీరులు వీరమాతలు... విప్లవవీరులు వీరమాతలు

ముద్దుబిడ్డలై మురిసే భూమి

భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు

చరణం : 3

సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా

ప్రజా క్షేమము ప్రగతిమార్గము

లక్ష్యములైన విలక్షణ భూమి... లక్ష్యములైన విలక్షణ భూమి

భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు

ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు

భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు... ఆ... ఆ...

చిత్రం : బడిపంతులు (1972)

రచన : ఆచార్య ఆత్రేయ

సంగీతం : కె.వి.మహదేవన్

గానం : ఘంటసాల, బృందం

----

పాట - 2

పల్లవి :

పిల్లలము బడి పిల్లలము నడుములు కట్టి కలిశాము

పిడికిలి బిగించి కదిలాము

పిల్లలము బడి పిల్లలము నడుములు కట్టి కలిశాము

పిడికిలి బిగించి కదిలాము

చరణం : 1

పలక బలపం పట్టిన చేతులు పలుగూ పార ఎత్తినవి

పలక బలపం పట్టిన చేతులు పలుగూ పార ఎత్తినవి

ఓనమాలను దిద్దినవే ళ్ళు ఒకైటె మట్టిని కలిపినవి

ఒకైటె మట్టిని కలిపినవి

పిల్లలము బడి పిల్లలము నడుములు కట్టి కలిశాము

పిడికిలి బిగించి కదిలాము

చరణం : 2

ప్రతి అణువు మా భక్తికి గుర్తు... ప్రతిరాయి మా శక్తికి గుర్తు

ప్రతి అణువు మా భక్తికి గుర్తు... ప్రతిరాయి మా శక్తికి గుర్తు

చేతులు కలిపి చెమటతో తడిపి

చేతులు కలిపి చెమటతో తడిపి

కోవెల కడదాం గురుదేవునికి

కోవెల కడదాం గురుదేవునికి

పిల్లలము బడి పిల్లలము నడుములు కట్టి కలిశాము

పిడికిలి బిగించి కదిలాము

చరణం : 3

తెలియని వాళ్ళకు తెలివిగల వాళ్ళకు తెరిచుంటవి

తెలియని వాళ్ళకు తెలివిగల వాళ్ళకు తెరిచుంటవి

ఈ ఇంటి తలుపులు వెలుగును ఇచ్చే

ఈ కిటికీలు పంతులుగారి చల్లని కళ్ళు

పంతులుగారి చల్లని కళ్ళు

పిల్లలము బడి పిల్లలము నడుములు కట్టి కలిశాము

పిడికిలి బిగించి కదిలాము

చిత్రం : బడిపంతులు (1972)

రచన : ఆచార్య ఆత్రేయ

సంగీతం : కె.వి.మహదేవన్

గానం : పి.సుశీల, బృందం

No comments:

Post a Comment