Monday, March 7, 2011

Arya 2 (2009) - 3

పాట - 1

పల్లవి :

ఉప్పెనంత ఈ ప్రేమకీ గుప్పెడెంత గుండె ఏమిటో

చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో

తీయనైన ఈ బాధకీ ఉప్పు నీరు కంట దేనికో

రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో

ఓ నిన్ను చూసే ఈ కళ్ళకీ లోకమంత ఇంక ఎందుకో

రెండు అక్షరాల ప్రేమకీ ఇన్ని ఎఫెక్షన్‌లెందుకో

ఐ లవ్ యు నా ఊపిరి ఆగిపోయినా

ఐ లవ్ యు నా ప్రాణం పోయినా

ఐ లవ్ యు నా ఊపిరి ఆగిపోయినా

ఐ లవ్ యు నా ప్రాణం పోయినా

ఉప్పెనంత ఈ ప్రేమకీ గుప్పెడెంత గుండె ఏమిటో

చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో

చరణం : 1

కనులలోకొస్తావు కలలు నరికేస్తావు

సెకనుకోసారైనా చంపేస్తావు

మంచులా ఉంటావు మంట పెడుతుంటావు

వెంటపడి నా మనసు మసి చేస్తావు

తీసుకుంటే నువ్వు ఊపిరి పోసుకుంట ఆయువే చెలీ

గుచ్చుకోకు ముళ్ళులా మరీ గుండెల్లో సరాసరి

ఐ లవ్ యు నా ఊపిరి ఆగిపోయినా

ఐ లవ్ యు నా ప్రాణం పోయినా

ఉప్పెనంత ఈ ప్రేమకీ గుప్పెడెంత గుండె ఏమిటో

చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో

చరణం : 2

చినుకులే నిను తాకి మెరిసిపోతానంటే

మబ్బులే పోగేసి కాల్చెయ్యనా

చిలకలే నీ పలుకు తిరిగి పలికాయంటే

తొలకరే లేకుండా పాతెయ్యనా

నిన్ను కోరి పూలు తాకితే నరుకుతాను పూలతోటనే

నిన్ను చూస్తే ఉన్న చోటనే తోడేస్తా ఆ కళ్ళనే

ఐ లవ్ యు నా ఊపిరి ఆగిపోయినా

ఐ లవ్ యు నా ప్రాణం పోయినా

ఉప్పెనంత ఈ ప్రేమకీ గుప్పెడెంత గుండె ఏమిటో

చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో


చిత్రం : ఆర్య-2 (2009)

రచన : బాలాజి

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

గానం : కె.కె.

----

పాట - 2

పల్లవి :

కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలీ జీవితం

శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా

కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం

కలలే జారే కన్నీరే చేరగా

గడిచే నిమిషం గాయమై

ప్రతి గాయం ఓ గమ్యమై

ఆ గమ్యం నీ గురుతుగా నిలేచేనా ప్రేమా

కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలీ జీవితం

శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా

కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం

కలలే జారే కన్నీరే చేరగా

చరణం : 1

పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను

ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను

నిదురను దాటి నడిచిన ఓ కల నేను

ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను

నా ప్రేమే నేస్తం అయ్యిందా... ఓ...

నా సగమేదో ప్రశ్నగ మారిందా... ఓ...

నేడీ బంధానికి పేరుందా... ఓ...

ఉంటే విడదీసే వీలుందా... ఓ...

కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలీ జీవితం

శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా

కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం

కలలే జారే కన్నీరే చేరగా

చరణం : 2

అడిగివన్నీ కాదని పంచిస్తూనే

మరునిమిషంలో అలిగే పసివాడివలే

నీ పెదవులపై వాడని నవ్వులతోన

నువు పెంచావా నీ కన్నీటిని చల్లి

సాగే మీ జంటని చూస్తుంటే... ఓ...

నా బాధంతటి అందంగా ఉందే... ఓ...

ఈ క్షణమే నూరేళ్ళవుతానంటే... ఓ...

మరుజన్మే క్షణమైనా చాలంతే... ఓ...

కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలీ జీవితం

శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా

కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం

కలలే జారే కన్నీరే చేరగా

గడిచే నిమిషం గాయమై

ప్రతి గాయం ఓ గమ్యమై

ఆ గమ్యం నీ గురుతుగా నిలేచేనా ప్రేమా


చిత్రం : ఆర్య-2 (2009)

రచన : వనమాలి

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

గానం : కునాల్ గంజావాలా, మేఘ

----

పాట - 3

ఛ! వాడికి నా మీద ప్రేమే లేదు

He doesn't love me you know

No... He loves you

He loves you so much

ఔనా? ఎంత?

ఊఁ... ఎంతంటే..? ఆఁ...

మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడూ కలిగినట్టి కోపమంత

మొదటిసారి నేను మాట్లాడినప్పుడూ పెరిగినట్టి ద్వేషమంత

మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడూ జరిగినట్టి దోషమంత

చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడూ తీరినట్టి భారమంత

ఓ... ఇంకా?

తెల్లతెల్లవారి పల్లెటూరిలోనా అల్లుకున్న వెలుగంతా

పిల్ల లేగదూడ నోటికంటుకున్న ఆవుపాల నురగంతా

చల్లబువ్వలోన నంజుకుంటు తిన్న ఆవకాయ కారమంతా

పెళ్లి ఊడు కొచ్చి తుళ్ళి ఆడుతున్న ఆడపిల్ల కోరికంత

Baby He loves you... loves you... loves you so much

Baby He loves you... loves you... loves you so much

హే... అందమైన కాలకింద తిరిగే నేలకున్న బరువంతా

నీలి నీలి నీ కళ్ళలోన మెరిసే నింగికున్న వయసంతా

చల్లనైన నీ శ్వాసలోన తొణికే గాలికున్న గతమంతా

చుర్రుమున్న నీ చూపులోన ఎగసే నిప్పులాంటి నిజమంతా

Baby He loves you... loves you... loves you so much

హాయ్... పంటచేలలోని జీవమంతా

ఘంటసాల పాట భావమంతా

పండ గొచ్చినా పబ్బమొచ్చినా వంటశాలలోని వాసనంతా

కుంభకర్ణుడి నిద్దరంతా ఆంజనేయుడీ ఆయువంతా

కృష్ణమూర్తిలో లీలలంతా రామలాలి అంత

Baby He loves you... loves you... loves you so much

పచ్చి వేపపుల్ల చేదు అంతా... చేదు

రచ్చబండపైన వాదనంతా

అర్ధమైనా కాకపోయినా భక్తి కొద్ది విన్న వేదమంతా

ఏటి నీటిలోన జాబిలంతా... జాబిలీ

ఏట ఏట వచ్చె జాతరంతా... జాతరా

ఏకపాత్రలో నాటకాలలో నాటుగోలలంత

Baby He loves you... loves you... loves you so much

అల్లరెక్కువైతే కన్నతల్లి వేసే మొట్టికాయ చనువంత

జల్లు పడ్డ వేళ పొంగి పొంగి పూసే మట్టిపూల విలువంతా

హో... బిక్కుబిక్కుమంటు పరీక్ష రాసే పిల్లగాడి బెదురంత

ఆ... లక్షమందినైన సవాలు చేసే ఆటగాడి పొగరంత

Baby He loves you... loves you... loves you so much

ఎంత దగ్గరైన నీకు నాకు మధ్యవున్న అంతులేని దూరమంతా

ఎంత చేరువైన నువ్వు నేను కలసీ చేరలేని తీరమంతా

ఎంత ఓర్చుకున్న నువ్వు నాకు చేసే జ్ఞాపకాల గాయమంతా

ఎంత గాయమైన హాయిగానే మార్చే ఆ తీపి స్నేహమంతా

Baby He loves you... loves you... loves you so much


చిత్రం : ఆర్య-2 (2009)

రచన : చంద్రబోస్

సంగీతం, గానం : దేవిశ్రీ ప్రసాద్

No comments:

Post a Comment