Monday, March 7, 2011

Ardhangi (1955) - 1

పాట - 1

పల్లవి :

ఎక్కడమ్మా చంద్రుడు ఎక్కడమ్మా చంద్రుడు

చక్కనైన చంద్రుడు

ఎక్కడమ్మా చంద్రుడు

చుక్కలారా అక్కలారా నిక్కి నిక్కి చూతురేలా

ఎక్కడమ్మా చంద్రుడు

చరణం : 1

చక్కనైనచంద్రుడు ఎక్కడమ్మా కానరాడు

చక్కనైన చంద్రుడు ఎక్కడమ్మా కానరాడు

మబ్బువెనక దాగినాడో మబ్బువెనక దాగినాడో

మనసు లేక ఆగినాడో

ఎక్కడమ్మా చంద్రుడు

చరణం : 2

పెరుగునాడు తరుగునాడు ప్రేమమారని సామి నేడు

పెరుగునాడు తరుగునాడు ప్రేమమారని సామి నేడు

పదముపాడి బ్రతిమిలాడి పలుకరించిన పలుకడేమి

పదముపాడి బ్రతిమిలాడి పలుకరించిన పలుకడేమి

చక్కనైన చంద్రుడు ఎక్కడమ్మా కానరాడు

ఏలనో కానరాడు

ఎక్కడమ్మా చంద్రుడు చక్కనైన చంద్రుడు

ఎక్కడమ్మా చంద్రుడు


చిత్రం : అర్థాంగి (1955)

రచన : ఆచార్య ఆత్రేయ

సంగీతం : బి.నరసింహారావు-అశ్వత్థామ

గానం : జిక్కి

No comments:

Post a Comment