పల్లవి :
ఎచటి నుండి వీచెనో... ఈ చల్లని గాలి
ఎచటి నుండి వీచెనో... ఈ చల్లని గాలి
తీవెలపై ఊగుతూ పూవులపై తూగుతూ
తీవెలపై ఊగుతూ పూవులపై తూగుతూ
ప్రకృతినెల్ల హాయిగా... ఆ...
ప్రకృతినెల్ల హాయిగా... ఆ...
తీయగా... మాయగా... పరవశింప జేయుచు
ఎచటి నుండి వీచెనో... ఈ చల్లని గాలి
చరణం : 1
జాబిలితో ఆడుతూ వెన్నెలతో పాడుతూ
జాబిలితో ఆడుతూ వెన్నెలతో పాడుతూ
మనసు మీద హాయిగా... ఆ...
మనసు మీద హాయిగా... ఆ...
తీయగా... మాయగా... మత్తుమందు జల్లుతూ
ఎచటి నుండి వీచెనో... ఈ చల్లని గాలి
చరణం : 2
హృదయవీణ మీటుతూ ప్రేమగీతి పాడుతూ
హృదయవీణ మీటుతూ ప్రేమగీతి పాడుతూ
ప్రకృతినెల్ల హాయిగా...
ప్రకృతినెల్ల హాయిగా...
తీయగా... మాయగా... పరవశింప జేయుచు
ఎచటి నుండి వీచెనో... ఈ చల్లని గాలి
ఈ చల్లని గాలి...
చిత్రం : అప్పుచేసి పప్పుకూడు (1959)
రచన : పింగళి నాగేంద్రరావు
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం :ఘంటసాల, పి.లీల
----
పాట - 2
పల్లవి :
మూగవైన ఏమిలే... నగుమోమే చాలులే
సైగలింక చాలింపుము జాణతనము తెలిసెనులే
మూగవైన ఏమిలే...
చరణం : 1
ఆపలేని అనురాగం చూపులలో తొణికెనులే
ఆపలేని అనురాగం చూపులలో తొణికెనులే
దొంగ మనసు దాగదులే... దొంగ మనసు దాగదులే...
సంగతెల్ల తెలిసెనులే
మూగవైన ఏమిలే...
చరణం : 2
పలుకకున్న ఏమాయెను వలపు బాసలింతేలే
పలుకకున్న ఏమాయెను వలపు బాసలింతేలే
నను దయతో ఏలుకొనుము
నను దయతో ఏలుకొమ్ము
కనుసన్నల మెలిగెదలే
మూగవైన ఏమిలే...
చరణం : 3
అందాలే బంధాలై నను బందీ చేసెనులే
అందాలే బంధాలై నను బందీ చేసెనులే
కలవరమిక ఎందుకులే...
కలవరమిక ఎందుకులే...
వలదన్నా వదలనులే
మూగవైన ఏమిలే... నగుమోమే చాలులే
సైగలింక చాలింపుము జాణతనము తెలిసెనులే
మూగవైన ఏమిలే...
చిత్రం : అప్పుచేసి పప్పుకూడు (1959)
రచన : పింగళి నాగేంద్రరావు
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : ఎ.ఎం.రాజా
----
పాట - 3
పల్లవి :
చేయి చేయి కలుపరావె హాయి హాయిగా
నదురు బెదురు మనకింక లేదు లేదుగా...
చేయి చేయి కలుపరావె హాయి హాయిగా
నదురు బెదురు మనకింక లేదు లేదుగా...
అహా... చేయి చేయి..
పెద్దవారి అనుమతింక లేదు లేదుగా
చేయి చేయి కలుపుటెలా హాయి హాయిగా...
పెద్దవారి అనుమతింక లేదు లేదుగా
చేయి చేయి కలుపుటెలా హాయి హాయిగా...
ఉహు... చేయి చేయి..
చరణం : 1
మగని మాటకెదురాడుట తగదు తగదుగా
నాతి చెంత విరహము నే తాళలేనుగా...
మగని మాటకెదురాడుట తగదు తగదుగా
నాతి చెంత విరహము నే తాళలేనుగా...
అహా... చేయి చేయి..
చరణం : 2
వీలు కాని విరహమింక వలదు వలదుగా
దాసి మీద వలపు మీకు తగదు తగదుగా...
వీలు కాని విరహమింక వలదు వలదుగా
దాసి మీద వలపు మీకు తగదు తగదుగా...
అహా... చేయి చేయి కలుపరావె హాయి హాయిగా
నదురు బెదురు మనకింక లేదు లేదుగా...
అహా... చేయి చేయి..
చిత్రం : అప్పుచేసి పప్పుకూడు (1959)
రచన : పింగళి
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
గానం : ఎ.ఎం.రాజా, పి.లీల
----
పాట - 4
పల్లవి :
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా
గొప్పనీతి వాక్యమిదే వినరా పామరుడా
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా
గొప్పనీతి వాక్యమిదే వినరా పామరుడా
చరణం : 1
దొంగతనము తప్పురా దోపిడీలు ముప్పురా
అందినంత అప్పుచేసి మీసం మెలితిప్పరా
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓన రుడా
గొప్పనీతి వాక్యమిదే వినరా పామరుడా
చరణం : 2
ఉన్నవారు లేనివారు రెండే రెండు జాతులురా
ఉన్నచోట తెచ్చుకొనుట లేనివారి హక్కురా
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓన రుడా
గొప్పనీతి వాక్యమిదే వినరా పామరుడా
చరణం : 3
వేలిముద్ర వేయరా సంతకాలు చేయరా
అంతగాను కోర్టుకీడిస్తే ఐపి బాంబుందిరా
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓన రుడా
గొప్పనీతి వాక్యమిదే వినరా పామరుడా
చరణం : 4
రూపాయే దైవమురా రూపాయే లోకమురా
రూకలేని వాడు భువిని కాసుకు కొరగాడురా
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓన రుడా
గొప్పనీతి వాక్యమిదే వినరా పామరుడా
చిత్రం : అప్పుచేసి పప్పుకూడు (1959)
రచన : పింగళి నాగేంద్రరావు
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : ఘంటసాల, బృందం
No comments:
Post a Comment