Monday, March 7, 2011

Anveshana (1985) - 1

పాట - 1

పల్లవి :

సా... నిసరీసాని... సా నిసమగామరి

పదసా... నిసరీసాని... సా... నిసమగామరి

పదసససని రిరిరిస గగగరి మమమగ పా...

సా ని ద ప మ గ రి స ని...

కీరవాణి... చిలకల కొలికరో పాడవేమే

వలపులే తెలుపుగా విరబూసిన ఆశలు

విరితేనెలు జల్లగ అలరులు కురిసిన రుతువులు

తడిసిన మధురసవాణి... కీరవాణి...

చిలకల కొలికరో పాడవేమే... వలపులే తెలుపుగా

చరణం : 1

గరిస పమగ పాని సరిగ రిగస నీద...

ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై

నా తోటలో చైత్రమై ఈ బాటనేనడచిరా

నీ గగనాలలో నే చిరుతారనై

నీ అధరాలలో నే చిరునవ్వునై

స్వరమే లయగా ముగిసే...

సలలిత కలరుత స్వరనుత గతియుత

గమకము తెలియకనే... కీరవాణి

చిలకలా కలకల పాడలేదు వలపులే తెలుపగా

ఇలరాలిన పూవులు వెదజల్లిన తావుల

అలకిడి ఎరుగని పిలుపుల అలిగిన మంజులవాణి

కీరవాణి... చిలకల కలకల పాడలేదు

వలపులే తెలుపుగా

చరణం : 2

నీ కన్నుల నీలమై నీ నవ్వుల వెన్నెలై

సంపెంగలా గాలినై తారాడనా నీడనై

నీ కవనాలలో నే తొలి ప్రాసనై

నీ జవనాలలో జాజుల వాసనై

ఎదలో ఎదలా కదిలే

పడుచుల మనసుల పంజర

శుకముల పలుకుల తెలియుకనే

కీరవాణి... చిలకల కలకల పాడలేదు

వలపులే తెలుపుగా విరబూసిన ఆశలు

విరితేనెలు జల్లగ అలరులు కురిసిన రుతువులు

తడిసిన మధురసవాణి... కీరవాణి...

చిలకల కొలికరో పాడవేమే... వలపులే తెలుపుగా


చిత్రం : అన్వేషణ (1985)

రచన : వేటూరి

సంగీతం : ఇళయరాజా

గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

No comments:

Post a Comment