Monday, March 7, 2011

Annapoorna (1960) - 1

పాట - 1

పల్లవి :

ఆ... ఆ... ఆ...

తళతళా మిలమిలా... తళతళా మిలమిలా

పగటిపూట వెన్నెలా... ఆ...ఆ...

ఎందువలన ఓ లలనా ఎందువలన

ఎందువలన ఓ లలనా ఎందువలన

తళతళా మిలమిలా... తళతళా మిలమిలా

పగటిపూట వెన్నెలా... ఆ... ఆ...

ఎందువలన ఓ లలనా ఎందువలన

ఎందువలన ఓ లలనా ఎందువలన

చరణం : 1

చిలకమ్మల కిలకిల చిగురాకుల కలకల

చిలకమ్మల కిలకిల చిగురాకుల కలకల

గాలి వీచి పూలు కురిసి కథలు తెలిపె కోయిల

తెలియరాని ఊహలలో తేలిపోవు వేళ

చిలిపిగా పావురాలు చూసి నవ్వెనేల

తళతళా మిలమిలా... తళతళా మిలమిలా

పగటిపూట వెన్నెలా... ఆ... ఆ...

ఎందువలన ఓ లలనా ఎందువలన

ఎందువలన ఓ లలనా ఎందువలన

చరణం : 2

మురిసిపోవు మనసులోని మధురభావన

మరుపురాని మరువలేని ఎవరిదీవెన

చిన్ననాటి మా చెలిమి చిగురించెను నేటికి

మనసు పయనమైనది మధురమైన చోటుకి

తళతళా మిలమిలా... తళతళా మిలమిలా

పగటిపూట వెన్నెలా... ఆ... ఆ...

ఎందువలన ఓ లలనా ఎందువలన

ఎందువలన ఓ లలనా ఎందువలన


చిత్రం : అన్నపూర్ణ (1960)

రచన : ఆరుద్ర

సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి

గానం : పి.సుశీల


No comments:

Post a Comment