Monday, March 7, 2011

Andame anandam (1977) - 1

పాట - 1
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

పల్లవి :

మధుమాసవేళలో మరుమల్లెతోటలో

మధుమాసవేళలో మరుమల్లెతోటలో

మనసైన చిన్నది... లేదేలనో...

మధుమాసవేళలో మరుమల్లెతోటలో

ఆ... ఆ... ఆహా... ఆ... ఆ.....

చరణం : 1

ఆడింది పూలకొమ్మా పాడింది కోయిలమ్మా

అనురాగ మందిరంలో కనరాదు పైడిబొమ్మా

ప్రణయాలు పొంగేవేళ... ఆ... ఆ...

ప్రణయాలు పొంగేవేళ నాలో రగిలే ఏదో జ్వాలా...

మధుమాసవేళలో మరుమల్లెతోటలో

చరణం : 2

ఉదయించే భానుబింబం వికసించలేదు కమలం

నెలరాజు రాకకోసం వేచింది కన్నె కుమురం

వలచింది వేదనకేనా... ఆ... ఆ...

వలచింది వేదనకేనా జీవితమంతా దూరాలేనా

మధుమాసవేళలో మరుమల్లెతోటలో

మనసైన చిన్నది... లేదేలనో...

మధుమాసవేళలో మరుమల్లెతోటలో

ఊహుహుఁ... ఆహహా... మరుమల్లెతోటలో

అహ ఆహా...ఆ... ఆహహా... మరుమల్లెతోటలో


చిత్రం : అందమే ఆనందం (1977)

రచన : దాశరథి

సంగీతం : సత్యం

గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

No comments:

Post a Comment