Monday, March 7, 2011

Anarkali (1955) - 2

పాట - 1


సాకీ :

మదన మనోహర సుందరనారి

మధుర దరస్మిత నయన చకోరి

మంద గమనజితరాజ మరాళి

నాట్యమయూరీ! అనార్ కలీ

అనార్ కలీ అనార్ కలీ వహవా!

ఆ... ఆ ఆ ఆ... ఆ... ఆ... ఆ ఆ ఆ... ఆ...

పల్లవి :

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా

రాజసాన ఏలరా

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా

రాజసాన ఏలరా

ఆ... ఆ ఆ ఆ... రాజశేఖరా! ఆ...

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా

రాజసాన ఏలరా... రాజశేఖరా!

చరణం : 1

మనసు నిలువ నీదురా మమత మాసిపోదురా

మనసు నిలువ నీదురా మమత మాసిపోదురా

మధురమైన బాధరా! మరపురాదు ఆ ఆ ఆ...

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా

రాజసాన ఏలరా... రాజశేఖరా!

చరణం : 2

కానిదాన కానురా కనులనైన కానరా

కానిదాన కానురా కనులనైన కానరా

ఆ... జాగుసేయనేలరా వేగ రావవేలరా

ఆ... జాగుసేయనేలరా వేగ రావవేలరా

చేరరారా చేరరారా చేరరారా...


చిత్రం : అనార్కలి (1955)

రచన : సముద్రాల సీనియర్

సంగీతం : పి.ఆదినారాయణరావు

గానం : ఘంటసాల, జిక్కి

----

పాట - 2

పల్లవి :

ఆ... ఆ... ఆ... ఆ.....

జీవితమే సఫలము... జీవితమే సఫలము

ఈ జీవితమే సఫలము

రాగసుధా భరితము ప్రేమకథా మధురము

జీవితమే సఫలము...

రాగసుధా భరితము ప్రేమకథా మధురము

జీవితమే సఫలము...

చరణం : 1

హాయిగా తీయగా ఆలపించు పాటలా

హాయిగా తీయగా ఆలపించు పాటలా

వరాల సోయగాల ప్రియుల వలపు గొలుపు మాటలా

వరాల సోయగాల ప్రియుల వలపు గొలుపు మాటలా

అనారు పూల తోటలా... ఆ... ఆ...

అనారు పూల తోటలా

ఆశ దెలుపు ఆటలా

జీవితమే సఫలము...

రాగసుధా భరితము ప్రేమకథా మధురము

జీవితమే సఫలము...

చరణం : 2

వసంత మధుర సీమలా ప్రశాంత సాంధ్య వేళలా

వసంత మధుర సీమలా ప్రశాంత సాంధ్య వేళలా

అంతులేని వింతలా అనంత ప్రేమలీలలా

అంతులేని వింతలా అనంత ప్రేమలీలలా

వరించు భాగ్యశాలలా... ఆ... ఆ...

వరించు భాగ్యశాలలా

తరించు ప్రేమజీవులా

జీవితమే సఫలము...

రాగసుధా భరితము ప్రేమకథా మధురము

జీవితమే సఫలము...


చిత్రం : అనార్కలి (1955)

రచన : సముద్రాల సీనియర్

సంగీతం : పి.ఆదినారాయణరావు

గానం : జిక్కి

No comments:

Post a Comment