Monday, March 7, 2011

Amma rajinama (1991) - 1

పాట - 1

పల్లవి :

ఎవరు రాయగలరూ అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం

ఎవరు పాడగలరూ అమ్మ అనురాగం కన్న తీయని రాగం

అమ్మేగా... ఆ...

అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి

అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి

ఎవరు రాయగలరూ అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం

ఎవరు పాడగలరూ అమ్మ అనురాగం కన్న తీయని రాగం

చరణం : 1

అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు

అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు

అవతామూర్తైనా అణువంతే పుడతాడు

అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు

అమ్మేగా... ఆ....

అమ్మేగా చిరునామా ఇంతటి ఘనచరితకి

అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని

ఎవరు రాయగలరూ అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం

ఎవరు పాడగలరూ అమ్మ అనురాగం కన్న తీయని రాగం

చరణం : 2

శ్రీరామరక్ష అంటూ నీళ్ళుపోసి పెంచింది

దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది

శ్రీరామరక్ష అంటూ నీళ్ళుపోసి పెంచింది

దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది

నూరేళ్ళు ఊఁ...

నూరేళ్ళు ఎదిగి బ్రతుకు అమ్మ చేతి నీళ్ళతో

నడక నేర్చుకుంది బ్రతకు అమ్మ చేతి వేళ్ళతో

ఎవరు రాయగలరూ అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం

ఎవరు పాడగలరూ అమ్మ అనురాగం కన్న తీయనిరాగం

అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి

అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి

ఎవరు రాయగలరూ అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం

ఎవరు పాడగలరూ అమ్మ అనురాగం కన్న తీయని రాగం

చిత్రం : అమ్మరాజీనామా (1991)

రచన : సిరివెన్నెల

సంగీతం : చక్రవర్తి

గానం : కె.ఎస్.చిత్ర

No comments:

Post a Comment