Friday, March 4, 2011

Abhinandana (1988) - 6

పాట - 1

పల్లవి :

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా

కథైనా కలైనా కనులలో చూడనా

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా

చరణం : 1

కొండ కోన గుండెల్లో ఎండ వానలైనాము

కొండ కోన గుండెల్లో ఎండ వానలైనాము

గువ్వా గువ్వ కౌగిట్లో గూడు చేసుకున్నాము

అదే స్నేహము అదే మోహము

అదే స్నేహము అదే మోహము

ఆది అంతము ఏదీ లేని గానము

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా

కథైనా కలైనా కనులలో చూడనా

చరణం : 2

నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు

నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు

కన్నీరైన ప్రేమల్లో పన్నీరవుదామన్నావు

అదే బాసగా అదే ఆశగా

అదే బాసగా అదే ఆశగా

ఎన్నినాళ్ళు ఈ నిన్నపాటే పాడను

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా

కథైనా కలైనా కనులలో చూడనా

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా


చిత్రం : అభినందన (1988)

రచన : ఆచార్య ఆత్రేయ

సంగీతం : ఇళయరాజా

గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

----

పాట - 2

పల్లవి :

మంచుకురిసే వేళలో మల్లె విరిసేదెందుకో

మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో

ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో

ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో

మంచుకురిసే వేళలో....

చరణం : 1

నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో

నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో

జలకమాడి పులకరించే సంబరంలో

జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో

జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో

ఎందుకా ఒంపులో ఏమిటా సొంపులో

మంచుకురిసే వేళలో మల్లె విరిసేదెందుకో

మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో

ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో

ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో

మంచుకురిసే వేళలో....

చరణం : 2

మొలకసిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో

మొలకసిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో

మన్మథునితో జన్మవైరం చాటినపుడో

ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో

ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో

మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడో

మంచుకురిసే వేళలో మల్లె విరిసేదెందుకో

మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో

ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో

ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో

మంచుకురిసే వేళలో...


చిత్రం : అభినందన (1988)

రచన : ఆచార్య ఆత్రేయ

సంగీతం : ఇళయరాజా

గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

---

పాట - 3

పల్లవి :

ఎదుటా నీవే ఎదలోన నీవే

ఎదుటా నీవే ఎదలోన నీవే

ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే

ఎదుటా నీవే ఎదలోన నీవే

చరణం : 1

మరుపే తెలియని నా హృదయం

తెలిసి వలచుట తొలి నేరం... అందుకే ఈ గాయం

మరుపే తెలియని నా హృదయం

తెలిసి వలచుట తొలి నేరం... అందుకే ఈ గాయం

గాయాన్నైనా మాననీవు... హృదయాన్నైనా వీడిపోవు

కాలం నాకు సాయం రాదు... మరణం నన్ను చేరనీదు

పిచ్చివాణ్ణి కానీదు... ఆహాహ... ఓహొహో...

ఎదుటా నీవే ఎదలోన నీవే

ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే

ఎదుటా నీవే ఎదలోన నీవే

చరణం : 2

కలలకు భయపడి పోయాను

నిదురకు దూరం అయ్యాను... వేదన పడ్డాను

కలలకు భయపడి పోయాను

నిదురకు దూరం అయ్యాను... వేదన పడ్డాను

స్వప్నాలైతే క్షణికాలేగా... సత్యాలన్నీ నరకాలేగా

స్వప్నం సత్యమైతే వింత... సత్యం స్వప్నమయ్యేదుందా

ప్రేమకింత బలముందా...! ఆహాహ... ఓహొహో...

ఎదుటా నీవే ఎదలోన నీవే

ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే


చిత్రం : అభినందన (1988)

రచన : ఆచార్య ఆత్రేయ

సంగీతం : ఇళయరాజా

గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

----

పాట - 4

పల్లవి :

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

చేసినాను ప్రేమక్షీరసాగర మథనం

మింగినాను హలాహలం...

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

చరణం : 1

పేమించుటేనా నా దోషము పూజించుటేనా నా పాపము

ఎన్నాళ్ళని ఈ ఎదలో ముళ్లు కన్నీరుగ ఈ కరిగే కళ్ళు

నాలోని నీ రూపము నా జీవనాధారము

అది ఆరాలి పోవాలి ప్రాణము

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

చరణం : 2

నే నోర్వలేను ఈ తేజము ఆర్పేయరాదా ఈ దీపము

ఆ చీకటిలో కలిసేపోయి నా రేపటినే మరిచేపోయి

మానాలి నీ ధ్యానము కావాలి నే శూన్యము

అనుడాగాలి ఈ మూగ గానము

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

చేసినాను ప్రేమక్షీరసాగర మథనం

మింగినాను హలాహలం...

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం


చిత్రం : అభినందన (1988)

రచన : ఆచార్య ఆత్రేయ

సంగీతం : ఇళయరాజా

గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

----

పాట - 5

పల్లవి :

లాలలాలలా... లాలాలాలలా...

ప్రేమలేదని ప్రేమించరాదని... ప్రేమలేదని ప్రేమించరాదని

సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని

ఓ... ప్రియా... జోహారులు...

ప్రేమలేదని ప్రేమించరాదని

సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని

ఓ... ప్రియా... జోహారులు... లాలలాలలా... లాలాలాలలా...

చరణం : 1

మనసు మాసిపోతే మనిషే కాదని

కటికరాయికైనా కన్నీరుందని

వలపుచిచ్చు రగులుకుంటె ఆరిపోదని

గడియపడిన మనసు తలుపుతట్టి చెప్పని

ముసురుగప్పి మూగవోయి నీవుంటివి

ముసురుగప్పి మూగవోయి నీవుంటివి

మోడుబారి నీడతోడు లేకుంటినీ

ప్రేమలేదని... లలలాలలాలలా

చరణం : 2

గురుతు చెరిపివేసి జీవించాలని

చెరప లేకపోతే మరణించాలని

తెలిసికూడ చేయలేని వెర్రివాడిని

గుండె పగిలిపోవు వరకు నన్ను పాడని

ముక్కలలో లెక్కలేని రూపాలలో

ముక్కలలో లెక్కలేని రూపాలలో

మరల మరల నిన్ను చూచి రోదించనీ

ప్రేమలేదని ప్రేమించరాదని

ప్రేమలేదని ప్రేమించరాదని

సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని

ఓ... ప్రియా... జోహారులు...


చిత్రం : ఆభినందన (1988)

రచన : ఆచార్య ఆత్రేయ

సంగీతం : ఇళయరాజా

గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

----

పాట - 6

పల్లవి :

రంగులలో కలవో ఎద పొంగులలో కళవో

రంగులలో కలవో ఎద పొంగులలో కళవో

నవ శిల్పానివో రతి రూపానివో

తొలి ఊహల ఊయలవో

రంగులలో కలవో ఎద పొంగులలో కళవో

చరణం : 1

కాశ్మీరనందన సుందరివో... కాశ్మీరనందన సుందరివో

కైలాసవుందిర లాస్యానివో

ఆమని పూచే యామినివో

కాశ్మీరనందన సుందరివో

మరుని బాణమో మధుమాస గానమో

నవపరిమళాల పారిజాత సుమమో

రంగులలో కలనై ఎద పొంగులలో కళనై

నవ శిల్పాంగినై రతి రూపాంగినై

నీ ఊహల ఊగించనా

రంగులలో కళనై...

చరణం : 2

ముంతాజు అందాల అద్దానివో

ముంతాజు అందాల అద్దానివో

షాజాను అనురాగ సౌధానివో

లైలా కన్నుల ప్రేయసివో... లైలా కన్నుల ప్రేయసివో

ప్రణయదీపమో నా విరహతాపమో

నా చిత్రకళా చిత్ర చైత్రరథమో

రంగులలో కలనై ఎద పొంగులలో కళనై

నవ శిల్పాంగినై రతి రూపాంగినై

నీ ఊహల ఊగించనా

రంగులలో కలనై ఎద పొంగులలో కళనై


చిత్రం : అభినందన (1988)

రచన : ఆచార్య ఆత్రేయ

సంగీతం : ఇళయరాజా

గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

No comments:

Post a Comment