Friday, March 4, 2011

Abhilasha (1983) - 4

పాట - 1
పల్లవి :

యురేకా...హహ్హాహ్హా...

తార తతార తతారత్తా... తార తతార తతారత్తా...

హహ్హాహ్హా... హహ్హాహ్హా... హే...

నవ్వింది మల్లెచెండు నచ్చింది గర్ల్‌ఫ్రెండు

దొరికెరా మజాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు

యురేకా సకమిక... నీ ముద్దు తీరేదాక

నవ్వింది మల్లెచెండు నచ్చింది గర్ల్‌ఫ్రెండు

దొరికెరా మజాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు

యురేకా సకమిక... సకమిక సకమిక సకమిక సకమిక

చరణం : 1

లవ్వు సిగ్నల్ నాకివ్వగానే నవ్వుకున్నాయ్ నా యువ్వనాలే

ఆ నవ్వుతోనే కదిలెయ్యుగానే నాటుకున్నయ్ నవనందనాలే

అహా చూపుల్లో నీ రూపం కనురెప్పల్లో నీ ప్రాణం

కన్నుకొట్టి కమ్ముకుంట కాలమంత అమ్ముకుంట

రపప్ప రపప్ప రపప్ప రపప్ప

కన్నె ఈడు జున్నులన్నీ జుర్రుకుంటా

నవ్వింది మల్లెచెండు నచ్చింది గర్ల్‌ఫ్రెండు

దొరికెరా మజాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు

యురేకా సకమిక...

చరణం : 2

కస్సుమన్న ఓ కన్నెపిల్ల యుస్సు అంటే ఓ కౌగిలింత

కిస్సులిచ్చి నే కౌగిలిస్తే అరె తీరిపోయే నాకున్న చింత

నేను పుట్టిందే నీ కోసం ఈ జన్మంతా నీ ధ్యానం

ముద్దు పెట్టి మొక్కుకుంట మూడు ముళ్ళు వేసుకుంట

సబబ్బా రిబబ్బా సబబ్బా సబరిబరబ...

ఏడు జన్మలేలుకుంట నేను జంటగా

నవ్వింది మల్లెచెండు నచ్చింది గర్ల్‌ఫ్రెండు

దొరికెరా మజాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు

యురేకా సకమిక... నీ ముద్దు తీరేదాక

యురేకా సకమిక... నీ ముద్దు తీరేదాక

యురేకా సకమిక... నీ ముద్దు తీరేదాక


చిత్రం : అభిలాష (1983)

రచన : వేటూరి

సంగీతం : ఇళయురాజా

గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

----

పాట - 2

పల్లవి :

సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది

అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది

మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు

ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో... ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో

సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది

అందగాడికి తోడు చలిగాలి రమ్మంది

ఎల్లువయ్యే ఈడు ఏడెక్కిపోయేవాడు

ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో... ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో

చరణం : 1

కొండ కోనా జలకాలాడే వేళ

కొమ్మరెమ్మ చీర కట్టే వేళ

పిందె పండై చిలకకొట్టే వేళ

పిల్ల పాప నిదరేపోయే వేళ

కలలో కౌగిలై కన్నులు దాటాలా

ఎదలే పొదరిల్లై వాకిలి తియ్యాల

ఎదటే తుమ్మెద పాట పూవుల బాట వెయ్యాల

సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది

అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది

ఎల్లువయ్యే ఈడు ఏడెక్కిపోయేవాడు

ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో... ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో

చరణం : 2

మల్లె జాజి మత్తు జల్లే వేళ

పిల్ల గాలి జోల పాడే వేళ

వానే వాగై వరదై పొంగే వేళ

నేనే నీైవె వలపై సాగే వేళ

కన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాల

పుట్టిన ఎన్నెల్లో పుటకలు కాగాలా

పగలే ఎన్నలగువ్వ చీకటి గువ్వలాడాలా

సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది

అందగాడికి తోడు చలిగాలి రమ్మంది

మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు

ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో

అరెరెరే... ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో

సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది

అందగాడికి తోడు చలిగాలి రమ్మంది


చిత్రం : అభిలాష (1983)

రచన : వేటూరి

సంగీతం : ఇళయరాజా

గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

----

పాట - 3

పల్లవి :

ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి

సొగసులై బృందావని విరిసెనా సిగలోనికి

జత వెతుకు హృదయానికి శ్రుతి తెలిపె మురళీ

చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళీ

రసమయం జగతి...

ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి

చరణం : 1

నీ ప్రణయభావం నా జీవరాగం

నీ ప్రణయభావం నా జీవరాగం

రాగాలు తెలిపే భావాలు నిజమైనవి

లోకాలు మురిసే స్నేహాలు ఋజువైనవి

అనురాగ రాగాల స్వరలోకమె మనదైనది

ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి

జత వెతుకు హృదయానికి శ్రుతి తెలిపె మురళీ

చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళీ

రసమయం జగతి

చరణం : 2

నా పేద హృదయం నీ ప్రేమ నిలయం

నా పేద హృదయం నీ ప్రేమ నిలయం

నాదైన బ్రతుకే ఏనాడో నీదైనది

నీవన్న మనిషే ఈనాడు నాదైనది

ఒక గుండె అభిలాష పదిమందికి బ్రతుకైనది

ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి

సొగసులై బృందావని విరిసెనా సిగలోనికి

జత వెతుకు హృదయానికి శ్రుతి తెలిపె మురళీ

చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళీ

రసమయం జగతి...


చిత్రం : అభిలాష (1983)

రచన : ఆచార్య ఆత్రేయ

సంగీతం : ఇళయరాజా

గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

----

పాట - 4

పల్లవి :

బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే

మల్లీమందారం పెళ్ళాడుకున్నాయిలే

నిద్దరనే సెలవడిగీ ఇద్దరినీ కలవమని

నిద్దరనే సెలవడిగీ ఇద్దరినీ కలవమని

బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే

మల్లీమందారం పెళ్ళాడుకున్నాయిలే

చరణం : 1

తేనె వాగుల్లో మల్లెపూలల్ల్లె తేలిపోదాములే

గాలి వానల్లో మబ్బుజంటల్లే రేగిపోదాములే

విసిరే కొసచూపే ముసురైపోతుంటే

ముసిరే వయసుల్లో మతి అసలే పోతుంటే

వేడెక్కి గుండె ల్లో తలదాచుకో

పాదాలలో ఉన్న తడి ఆర్చుకో

ఆకాశమంటే ఎదలో జాబిల్లి నీవే వెన్నెల్లు తేవే

బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే

మల్లీమందారం పెళ్ళాడుకున్నాయిలే

నిద్దరనే సెలవడిగీ ఇద్దరినీ కలవమని

నిద్దరనే సెలవడిగీ ఇద్దరినీ కలవమని

బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే

తారతా... తరరా తరరా... తారతా... తరరా తరరా...

చరణం : 2

పూత పెదవుల్లో ముద్దు గోరింకా బొట్టుపెట్టిందిలే

ఎర్ర ఎర్రంగా కుర్ర బుగ్గల్లో సిగ్గుతీరిందిలే

ఒదిగే మనకే దో ఒకటై పొమ్మంటే

ఎదిగే వలపంతా ఎదలొకటై రమ్మంటే

కాలాలు కరిగించు కౌగిళ్ళలో

దీపాలు వెలిగించు నీ కళ్ళతో

ఆ మాట వింటే కరిగే నా ప్రాణమంతా నీ సొంతమేలే

బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే

మల్లీమందారం పెళ్ళాడుకున్నాయిలే

నిద్దరనే సెలవడిగీ ఇద్దరినీ కలవమని

నిద్దరనే సెలవడిగీ ఇద్దరినీ కలవమని

బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే


చిత్రం : అభిలాష (1983)

రచన : భువనచంద్ర

సంగీతం : ఇళయరాజా

గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

No comments:

Post a Comment