Friday, March 4, 2011

Aaru (2005) - 1

పాట - 1

పల్లవి :

చూడొద్దే నను చూడొద్దే చురకత్తిలాగ నను చూడొద్దే

వెళ్లొద్దే వదిలెళ్ళొద్దే మది గూడు దాటి వదిలెళ్ళొద్దే

అప్పుడు పంచిన నీ మనసే అప్పని అనవద్దే

ఇప్పుడు పెరిగిన వడ్డితోఇమ్మని అడగొద్దే

చూడొద్దే నను చూడొద్దే చురకత్తిలాగ నను చూడొద్దే

వెళ్లొద్దే వదిలెళ్ళొద్దే మది గూడు దాటి వదిలెళ్ళొద్దే

చరణం : 1

వద్దు వద్దంటూ నీనున్న వయసే గిల్లింది నువ్వేగా

పొ పో పొమ్మంటూ నీనున్న పొగలా అల్లింది నువ్వేగా

నిదరౌతున్న హృదయాన్ని లాగింది నువ్వేగా

నలుపై ఉన్న రాతిరికి రంగులు నువ్వేగా

నాతో నడిచిన నా నీడ నీతో నడిపావే

నాలో నిలిచే నాప్రాణం నువ్వై నిలిచావే

చూడొద్దే నను చూడొద్దే చురకత్తిలాగ నను చూడొద్దే

వెళ్లొద్దే వదిలెళ్ళొద్దే మది గూడు దాటి వదిలెళ్ళొద్దే

చరణం : 2

వద్దు వద్దంటూనువ్వున్నా వలపే పుట్టింది నీపైనా

కాదు కాదంటూ నువ్వున్నా కడలే పొంగింది నాలోన

కన్నీళ్ళ తీరంలో పడవల్లే నిలిచున్నా

సుడిగుండాల శ్రుతిలయలో వెలుగే ఇస్తున్నా

మంటలు తగిలిన పుత్తడిలో మెరుపే కలుగునులే

ఒంటిగా తిరిగిన ఇద్దరిలో ప్రేమే పెరిగునులే

చూడొద్దు నను చూడొద్దు చురకత్తిలాగ నను చూడొద్దు

వెళ్లొద్దు వదిలెళ్ళొద్దు మది గూడు దాటి వదిలెళ్ళొద్దు

అప్పుడు పంచిన నా మనసే అప్పని అనలేదే

గుప్పెడు గుండెల చెలి ఊసే ఎప్పుడు నీదేలే


చిత్రం : ఆరు (2005)

రచన : చంద్రబోస్

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

గానం : టిప్పు, సుమంగళి

No comments:

Post a Comment