Wednesday, April 6, 2011

Kottabangarulokam (2008) - 3

పాట - 1
పల్లవి :

నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా

ఇదంతా ప్రేమేనా ఎన్నొ వింతలు చూస్తున్నా

ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా

వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా

హరే హరే హరే హరే హరే రామా...

మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా

ఎంతో హుషారుగా ఉన్నాదేదో లోనా... ఏమ్మా

హరే హరే హరే హరే హరే రామా...

మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా

ఎంతో హుషారుగా ఉన్నాదేదో లోనా... ఏమ్మా

నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా

ఇదంతా ప్రేమేనా ఎన్నొ వింతలు చూస్తున్నా

చరణం : 1

ఈ వయస్సులో ఒకో క్షణం ఒకో వసంతం

నా మనస్సుకి ప్రతిక్షణం నువ్వే ప్రపంచం

ఓ సముద్ర మై అనుక్షణం పొంగే సంతోషం

అడుగులలోనా అడుగుల వేస్తూ

నడచిన దూరం ఎంతో ఉన్నా

అలసట రాదూ గడచిన కాలం ఇంతని నమ్మనుగా...

నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా

ఇదంతా ప్రేమేనా ఎన్నొ వింతలు చూస్తున్నా

చరణం : 2

నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటే

నా గతాలనే కవ్వింతలై పిలుస్తూ ఉంటే

ఈ వరాలుగా ఉల్లాసమై కురుస్తూ ఉంటే

పెదవికి చెంపా తగిలిన చోట

పరవశమేదో తోడౌతుంటే

పగలే అయినా గగనంలోనా తారలు చేరెనుగా...

నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా

ఇదంతా ప్రేమేనా ఎన్నొ వింతలు చూస్తున్నా

ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా

వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా

హరే హరే హరే హరే హరే రామా...

మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా

ఎంతో హుషారుగా ఉన్నాదేదో లోనా... ఏమ్మా

హరే హరే హరే హరే హరే రామా...

మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా

ఎంతో హుషారుగా ఉన్నాదేదో లోనా... ఏమ్మా


చిత్రం : కొత్త బంగారులోకం (2008)

రచన : అనంత శ్రీరామ్

సంగీతం : మిక్కీ జె.మేయర్

గానం : కార్తీక్

----

పాట - 2

పల్లవి :

నేననీ నీవనీ వేరుగా లేమనీ

చెప్పినా వినరా ఒకరైనా

నేను నీ నీడనీ నువ్వు నా నిజమనీ

ఒప్పుకోగలరా ఎపుడైనా

రెప్ప వెనకాలా స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే

అడ్డుకోగలదా వేగం కొత్త బంగారూ లోకం పిలిస్తే

చరణం : 1

మొదటిసారి మదిని చేరి నిదరలేపిన ఉదయమా

వయసులోని పసితనాన్ని పలకరించిన ప్రణయమా

మరీ కొత్తగా... మరో పుట్టుకా

అనేటట్టుగా... ఇది నీ మాయేనా

నేననీ నీవనీ వేరుగా లేమనీ

చెప్పినా వినరా ఒకరైనా

నేను నీ నీడనీ నువ్వు నా నిజమనీ

ఒప్పుకోగలరా ఎపుడైనా

రెప్ప వెనకాలా స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే

అడ్డుకోగలదా వేగం కొత్త బంగారూ లోకం పిలిస్తే

చరణం : 2

పదము నాది పరుగు నీది రథమువై రా ప్రియతమా

తగువు నాది తెగువ నీది గెలుచుకో పురుషోత్తమా

నువ్వే దారిగా... నేనే చేరగా

ఎటూ చూడకా... వెనువెంటే రానా

నేననీ నీవనీ వేరుగా లేమనీ

చెప్పినా వినరా ఒకరైనా

నేను నీ నీడనీ నువ్వు నా నిజమనీ

ఒప్పుకోగలరా ఎపుడైనా

రెప్ప వెనకాలా స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే

అడ్డుకోగలదా వేగం కొత్త బంగారూ లోకం పిలిస్తే

చిత్రం : కొత్తబంగారులోకం (2008)

రచన : సిరివెన్నెల

సంగీతం : మిక్కీ జె.మేయర్

గానం : శ్వేత పండిట్

----

పాట - 3

పల్లవి :

నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగా

నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా

ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా

ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా

పది నెలలు తనలో నిన్ను మోసిన అమై్మనా

అపుడో ఇపుడో కననీ కలను అంటుందా

ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమై్మనా

గుడికో జడకో సాగనంపక ఉంటుందా

బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా

పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగ

ఒక నిమిషం కూడ ఆగిపోదే నువ్వొచ్చేదాకా

ఓ... ఓ... ఓ... ఓ.....

చరణం : 1

అలలుండని కడలేదని అడిగేందుకు తెలివుందా

కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా

గత ముందని గమనించని నడిరేయికి రేపుందా

గతి తోచని గమనానికి గమ్యం అంటూ ఉందా

వలపేదో వలవేస్తుంది వయసేమో అటు తోస్తుంది

గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే ఋజువేముంది

సుడిలో పడు ప్రతి నావా చెబుతున్నది వినలేదా

చరణం : 2

పొరపాటున చెయి జారిన తరుణం తిరిగొస్త్తుందా

ప్రతిపూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా

మనకోసమే తనలో తను రగిలే రవి తపనంతా

కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా

కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని

అని తిరగేశాయా చరిత పుటలు వెను చూడక ఉరికే వెతలు

తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు

ఇది కాదే విధి రాత అనుకోదేం ఎదురీత


చిత్రం : కొత్తబంగారులోకం (2008)

రచన : సిరివెన్నెల

సంగీతం : మిక్కీ జె.మేయర్

గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

No comments:

Post a Comment