రసికరాజ తగువారము కామా...
సికరాజ తగువారము కామా...
ఆ... ఆ... ఆ... అఅఅ... ఆ....
రసికరాజ తగువారము కామా...
అగడుసేయ తగవా.... ఆ....
ఏలుదొరవు అరమరికలు ఏలా
ఏలవేల సరసాల సురసాల...
ఏలుదొరవు అరమరికలు ఏలా
ఏలవేల సరసాల సురసాల...
ఏలుదొరా... ఆ... ఆ... ఆ.....
నిన్ను తలచి గుణగానము జేసి
నిన్ను తలచి గుణగానము జేసి
నిన్ను తలచి గుణగానము జేసి
దివ్యనామ మధుపానము జేసి
నిన్ను తలచి... పా... దపమగరిసా... నిన్ను తలచి
దనిపా నిదసనిపమగరిసరిసా
నిదనిసా నిదనిసమగమ పమగమ దని సనిపా
మగమదా దనిసరి సరిమగామరిస నిసరిసా నిదనిసా నిపమపా
మగరిసా... నిన్ను తలచి...
దనిద దనిద దనిదనిదస నిపమప గా మా పా
దనిస నిప మప గా మా దా
నిరిస నిపగమ దానీసా
గమరి సరిసా సరిసనిసనీ నిసని దనిదా నిసని పనిపా
మగమ దని సారిసా నిసనీ పనిపా మపమా నిసనీ పనిపా మపమా గమగా
రిగరిసరిసనిస సరిసనిసనిదని నిసనిపనిపమప సనిపమగరిస...
సససస సససస సనిదని సనిసస సనిదని సనిదని
సనిసమ గరిసని సనిసప మగరిస సనిసని పమగరి
నినిని నినినినిని నినిని నినినినిని దదద దదదదద దదద దదదదద
దదని దదని దదని దనిదని దదని దదని దదని దానిదాని
సనిసమ గమపమ గమనిదనీపా
గగగ మమమ దదద నినిని రిరిరి గగగ మమమ రిరిరి సనిసా
గారీసాని దానీసా గరిసనిద నీసా రీసానీద నీసానిరీ
రిసనిదనిసానీ గామాద మాదాని దానీసరీ గారీ సానీద
రీసానీదామగామాదానీపా
గామాదనిస రీసారిసరి రీపామగమరీ
గరిసనిద రిసనిపమ గమదనిసా
రిసనిదని సనిపమప మగమదని
సనిపమప దనిపమగ పమగరిస
నిన్ను తలచి గుణగానము చేసి
దివ్యనామ మధుపానము చేసి
సారసాక్ష మనసా వచసా... ఆ...
నీ సరస జేరగనే సదా వేదనా...
ఏలుదొరవు అరమరికలు ఏలా
ఏలవేల సరసాల సురసాల...
ఏలుదొరా... ఆ.....
చిత్రం : జయభేరి (1959)
రచన : మల్లాది రామకృష్ణశాస్ర్తి
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
గానం : ఘంటసాల
----
పాట - 2
పల్లవి :
రాగమయీ రావే అనురాగమయీ రావే
రాగమయీ రావే అనురాగమయీ రావే
రాగమయీ రావే...
అనుపల్లవి :
నీలాల గగనాన నిండిన వెన్నెల
నీలాల గగనాన నిండిన వెన్నెల
నీ చిరునవ్వుల కలకలలాడగ
రాగమయీ రావే అనురాగమయీ రావే
రాగమయీ రావే...
చరణం : 1
చివురులు మేసిన చిన్నారి కోయిల
మరిమరి మురిసే మాధురి నీవే
చివురులు మేసిన చిన్నారి కోయిల
మరిమరి మురిసే మాధురి నీవే
తనువై మనసై నెలరాయనితో
కలువలు కులికే సరసాలు నీవే
సరసాలు నీవే సరాగాలు నేనే
రాగమయీ రావే అనురాగమయీ రావే
రాగమయీ రావే...
చరణం : 2
సంజెలలో సంజెలలో హాయిగ సాగే చల్లనిగాలిలో
మరుమల్లెల విరజాజుల పరిమళమే నీవు
జిలుగే సింగారమైన చుక్క కన్నెలు అంబరాన
జిలుగే సింగారమైన చుక్క కన్నెలు అంబరాన
సంబరపడు చక్కిలిగింతల పరవశమే నేను
నవ పరిమళమే నీవు
రావే రాగమయీ నా అనురాగమయీ
రావే రాగమయీ నా అనురాగమయీ
చరణం : 3
నీడజూసి నీవనుకొని పులకరింతునే
అలవికాని మమతలతో కలువరింతునే
నీ కోసమే ఆవేదన నీ రూపమే ఆలాపన
కన్నెలందరూ కలలు కనే అందాలన్నీ నీవే
నిన్నందుకొనీ మైమరచే ఆనందమంతా నేనే
రావే రాగమయీ నా అనురాగమయీ
రావే రాగమయీ నా అనురాగమయీ
చిత్రం : జయభేరి (1959)
రచన : మల్లాది రామకృష్ణశాస్ర్తి
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
గానం : ఘంటసాల
----
పాట - 3
సాకీ :
అధికులనీ... అధములనీ...
న రుని దృష్టిలోనే భేదాలు
శివుని దృష్టిలో అంతా సమానులే
పల్లవి :
నందుని చరితము వినుమా
పరమానందము గనుమా... ఆ...
పరమానందము గనుమా...
నందుని చరితము వినుమా
పరమానందము గనుమా... ఆ...
పరమానందము గనుమా...
చరణం : 1
ఆదనూరులో... మాలవాడలో
ఆదనూరులో... మాలవాడలో
పేదవాడుగా జనియించి
చిదంబరేశుని పదాంబుజములే
మదిలో నిలిపి కొలిచేను
నందుని చరితము వినుమా
పరమానందము గనుమా... ఆ...
పరమానందము గనుమా...
చరణం : 2
తన యజమానుని ఆన తి వేడెను
శివుని చూడగా మనసుపడి
తన యజమానుని ఆన తి వేడెను
శివుని చూడగా మనసుపడి
పొలాల సేద్యం ముగించి రమ్మని
పొలాల సేద్యం ముగించి రమ్మని
గడువే విధించె యజమాని
యజమాని ఆనతిచ్చిన గడువులో
ఏరీతి పొలము పండించుటో ఎరుగక
అలమటించు... తన భక్తుని కార్యము
ఆ శివుడే నెరవేర్చే... ఏ ఏ ఏ...
పరుగున పోయెను చిదంబరానికి
భక్తుడు నందుడు ఆత్రమున
పరుగున పోయెను చిదంబరానికి
భక్తుడు నందుడు ఆత్రమున
చిదంబరంలో శివుని దర్శనం
చేయగరాదనె పూజారి
ఆశాభంగము పొందిన నందుడు ఆ గుడిముందే మూర్ఛిల్లే
అంతట శివుడే అతనిని బ్రోచి
పరంజ్యోతిగా వెలయించే...
చిత్రం : జయభేరి (1959)
రచన : శ్రీశ్రీ
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
గానం : ఘంటసాల
No comments:
Post a Comment