Friday, April 1, 2011

Jeans (1998) - 4

పాట - 1
పల్లవి :

పూవుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం

ఆ సీతకోకాచిలక ఒళ్ళెంతో అతిశయం

వేణువులో గాలి సంగీతాలే అతిశయం

గురువెవ్వరులేని కోయిలపాటే అతిశయం

అతిశయమే అచ్చెరువొందే నీవేనా అతిశయం

ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు

ముందున్న ప్రేమేగా అతిశయం ఓ..

పదహారు ప్రాయాన పరువంలో అందరికి

పుట్టేటి ప్రేమేగా అతిశయం

పూవుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం

ఆ సీతకోకాచిలక ఒళ్ళెంతో అతిశయం

వేణువులో గాలి సంగీతాలే అతిశయం

గురువెవ్వరులేని కోయిలపాటే అతిశయం

అతిశయమే అచ్చెరువొందే నీవేనా అతిశయం

చరణం : 1

ఏ వాసనలేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నాయ్

పూలవాసన అతిశయమే

ఆ సంద్రం ఇచ్చిన మేఘంలో ఒక చిటికెడైనా ఉప్పుందా

వాననీరు అతిశయమే

విద్యుత్తే లేకుండా వేలాడే దీపాల్లా

వెలిగేటి మిణుగురులతిశయమే

తనువులో ప్రాణం ఏ చోటనున్నదో

ప్రాణంలోన ప్రేమ ఏ చోటనున్నదో

ఆలోచిస్తే అతిశయమే

ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు

ముందున్న ప్రేమేగా అతిశయం ఓ...

పదహారు ప్రాయాన పరువంలో అందరికి

పుట్టేటి ప్రేమేగా అతిశయం

పూవుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం

ఆ సీతకోకాచిలక ఒళ్ళెంతో అతిశయం

వేణువులో గాలి సంగీతాలే అతిశయం

గురువెవ్వరులేని కోయిలపాటే అతిశయం

అతిశయమే అచ్చెరువొందే నీవేనా అతిశయం

చరణం : 2

అల వెన్నెలంటి ఒక దీవి ఇరు కాళ్ళంట నడిచొస్తే

నీవేనా అతిశయము

జగమున అతిశయాలు ఏడైనా ఓ మాట్లాడే పువ్వా నువు

ఎనిమిదవ అతిశయము

నింగిలాంటి నీ కళ్ళు పాలుగారే చెక్కిళ్ళు

తేనెలూరే అధరాలు అతిశయమే

మగువ చేతివేళ్ళు అతిశయమే

మకుటాల్లంటి గోళ్ళు అతిశయమే

కదిలే ఒంపులు అతిశయమే

ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు

ముందున్న ప్రేమేగా అతిశయం ఓ...

పదహారు ప్రాయాన పరువంలో అందరికి

పుట్టేటి ప్రేమేగా అతిశయం

పూవుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం

ఆ సీతకోకాచిలక ఒళ్ళెంతో అతిశయం

వేణువులో గాలి సంగీతాలే అతిశయం

గురువెవ్వరులేని కోయిలపాటే అతిశయం

అతిశయమే అచ్చెరువొందే నీవేనా అతిశయం


చిత్రం : జీన్స్ (1998)

రచన : ఎ.ఎం.రత్నం, శివగణేశ్

సంగీతం : ఎ.ఆర్.రెహమాన్

గానం : ఉన్నికృష్ణన్, సుజాత

----

పాట - 2

పల్లవి :

ప్రియా ప్రియా చంపొద్దే న వ్వీ నన్నే ముంచొద్దే

చెలీ కన్నులతో హృదయం కాల్చోద్దే

అయ్యో వనెలతో ప్రాణం తీయొద్దే

ప్రియా ప్రియా చంపొద్దే న వ్వీ నన్నే ముంచొద్దే

చరణం : 1

చెలియా నీకు నడమును చూశా

అరెరే బ్రహ్మింత పిసనారి

తలపెకైత్త కళ్లు తిరిగిపోయే ఆహా అతడే చమత్కారి

మెరుపును తెచ్చి కొంచెగా మలచి రవివర్మ గీసిన వదనమట

నూరడగుల శిల ఆరడుగుల శిల్పులు చెక్కిన రూపమట

భువిలో పుట్టినా స్ర్తీలందరిలో నీవే నీవే అందమటా

అంతటి అందం అంతా ఒకటై నన్నే చంపుట గోరమటా

ప్రియా ప్రియా చంపొద్దే న వ్వీ నన్నే ముంచొద్దే

అందమైన పువ్వా పువ్వా చెలి కురులు సొరభి తెలిపేనా

అందమైన నదివే నదివే చెలి మీటి సొగసు తెలిపేనా

అందమైన గొలుసా గొలుసా కాలి సొగసు తెలిపేనా

అందమైన మణివే మణివే గుండె గుబులు తేలిపేనా

చరణం : 2

చంద్రగోళంలో ఆక్సిజిన్ నింపి అక్కడ నీకొక గుడికడతా

నీ ప్రాణాలను కాపాడేందుకు నా ప్రాణాలను బదులిస్తా

మబ్బులు తెచ్చి పరుపుగ పేర్చి కోమలాంగి నిను జోకొడతా

నిద్దురలోన చెమటలు పడితే నక్షత్రాలతో తుడిచేస్తా

పంచవన్నె చిలక జలకాలాడగా మంచు బిందువలే సేకరిస్తా

దేవత జలకాలాడిన జలమును గంగాజలముగ సేవిస్తా

ప్రియా ప్రియా చంపొద్దే...

ప్రియా ప్రియా చంపొద్దే న వ్వీ నన్నే ముంచొద్దే

చెలీ కన్నులతో హృదయం కాల్చోద్దే

అయ్యో వనెలతో ప్రాణం తీయొద్దే

ప్రియా ప్రియా చంపొద్దే న వ్వీ నన్నే ముంచొద్దే


చిత్రం : జీన్స్ (1998)

రచన : ఎ.ఎం.రత్నం, శివగణేశ్

సంగీతం : ఎ.ఆర్.రహమాన్

గానం : శ్రీనివాస్, బృందం

----

పాట - 3

సాకీ :

నాకే నాకా... నాకే నాకా...

నువు నాకే నాకా... ఆ...ఊఁ...

మధుమిత మధుమిత మధుమిత...

పల్లవి :

హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...

హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...

ఫిఫ్టి కేజి తాజ్మహల్ నాకే నాకా

ఫ్లైట్ తెచ్చిన నందనవనం నాకే నాకా

హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...

హార్ట్ సైజు వెన్నెలలు నాకే నాకా

ఫ్యాక్స్లొచ్చిన స్ర్తీ కవిత నాకే నాకా

ముద్దుల వానలో నిను తడిపేనా

కురులతోటి తడి తుడిచేనా

నిన్ను నేను కప్పుకొనేనా

పెదవిపైనే పవళించేనా

పట్టు పూవా పుట్ట తేన

నీ నడుం సగం తాకనివ్వవా

హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...

ఫిఫ్టి కేజి తాజ్మహల్ నాకే నాకా

ఫ్లైట్ తెచ్చిన నందనవనం నాకే నాకా

చరణం : 1

కలిసి ఇద్దరం చిరునడకలతో అమెరికానే తిరిగొద్దాం

కడలిపై ఎరట్రి తివాచీ పరచి ఐరోపాలో కొలువుందాం

మన ప్రేమనే కవి పాడగా

షెల్లీకి బైరన్కూ సమాధినే ధర చెడగొడదాం

నీలాకాశమే దాటి ఎగరకు ఏమైనదో నీ మనసుకు ఉల్లాసమో ఉత్సాహమో

ప్రేమ పిచ్చితో గాలై తిరగకు ఏమైనదో నీ వయసుకు ఆయాసమో ఆవేశమో

పైర గాలికి వయసాయే నేల తల్లికి వయసాయే

కోటియుగాలైనాగానీ ప్రేమకు మాత్రం వయసైపోదు

హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...

ఫిఫ్టి కేజి తాజ్మహల్ నాకే నాకా

ఫ్లైట్ తెచ్చిన నందనవనం నాకే నాకా

చరణం : 2

చెర్రి పూలను దోచేగాలి చెవిలో చెప్పెను ఐలవ్యూ

సైఫస్ చెట్లలో దావుద్ పక్షి నాతో అన్నది ఐలవ్యూ

నీ ప్రేమనే నువు తెలుపగ

గాలులు పక్షులు ప్రేమ పత్రమై కుమిలినవో

ఒంటె కాలితో పూవే నిలిచెను నీ కురులలో నిలిచేందుకే పూమాలవో పూవెట్టనా

చిందే చినుకులు నేల వాలెను నీ బుగ్గలే ముద్దాడ గా నేను నిన్నూ ముద్దాడనా

హృదయ స్పందన నిలిచె నువు ప్రాణముండును ఒక నిమిషం

ప్రియా నన్ను నువ్విడిస్తే మరుక్షణం ఉండదు నాప్రాణం

హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...

ఫిఫ్టి కేజి తాజ్మహల్ నాకే నాకా

ఫ్లైట్ తెచ్చిన నందనవనం నాకే నాకా

హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...

హార్ట్ సైజు వెన్నెలలు నీకే నీకు

ఫ్యాక్స్లొచ్చిన స్ర్తీ కవిత నీకే నీకు

నిన్ను నేను కప్పుకొనేనా

పెదవిపైనే పవళించేనా

ముద్దుల వానలో నిను తడిపేనా

కురులతోటి తడి తుడిచేనా

పట్టు పూవా పుట్ట తేన

నీ నడుం సగం తాకనివ్వవా

హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...


చిత్రం : జీన్స్ (1998)

రచన : ఎ.ఎం.రత్నం, శివ గణేశ్

సంగీతం : ఎ.ఆర్.రెహమాన్

గానం : ఉన్నికృష్ణన్, పల్లవి

----

పాట - 4

పల్లవి :

కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు

ఆనందంగా గడపడానికి కావాలొక దీవి

కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు

ఆనందంగా గడపడానికి కావాలొక దీవి

సెలవు సెలవు సెలవు కనుగొను కొత్త దీవి నీవు

సెలవు సెలవు సెలవు కనుగొను కొత్త దీవి నీవు

కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు

ఆనందంగా గడపడానికి కావాలొక దీవి

కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు

ఆనందంగా గడపడానికి కావాలొక దీవి

సెలవు సెలవు సెలవు కనుగొను కొత్త దీవి నీవు

సెలవు సెలవు సెలవు కనుగొను కొత్త దీవి నీవు

శని ఆదివారాల్లేవని అన్నవీ ఓహో మనుషుల్ని మిషన్‌లు కావద్దన్నవీ

చంపే సైన్యమూ అణు ఆయుధం

ఆకలి పస్తులు డర్టీ పాలిటిక్స్

పొల్యూషన్ ఏదీ చొరబడ లేని దీవి కావాలి ఇస్తావా కొలంబస్...

చరణం : 1

వారం ఐదునాళ్ళు శ్రమకే జీవితం

వారం రెండునాళ్ళు ప్రకృతికి అంకితం

వీచేగాలిగ మారి పూవులనే కొల్లగొట్టు మనస్సులు చక్కబెట్టు

మళ్లీ పిల్లలౌతాం వలలంటా ఆడి

పక్షుల రెక్కలు అద్దెకు దొరికితే

ఒంటికి తొడిగి పెకైగురూ

పక్షులకెన్నడూ పాస్‌పోర్ట్ లేదు ఖండాలన్నీ దాటెళ్ళు

నేడు విరామమేగవద్దు అయినా విశ్రమించలేదు

నేడు నిర్వాణా చేపలల్లే ఈదుదాం... కొలంబస్...

కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు

ఆనందంగా గడపడానికి కావాలొక దీవి

సెలవు సెలవు సెలవు కనుగొను కొత్త దీవి నీవు

సెలవు సెలవు సెలవు కనుగొను కొత్త దీవి నీవు

చరణం : 2

నడిచేటి పూలను కొంచెం చూడు

నేడైనా మడిమణిగాను లవ్వరైతే లేదు

అల నురగలు తెచ్చి చెలి చీరే చెయ్యరారాదా

నెలవంకను గుచ్చి చెలి మెడలో వెయ్యరారాదా

వీకెండు ప్రేయసి ఓకే అంటే ప్రేమించు

టైంపాసింగ్ ప్రేమలా పూటైనా ప్రేమించు

వారం రెండునాళ్ళు వర్థిల్లగా... కొలంబస్...

కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు

ఆనందంగా గడపడానికి కావాలొక దీవి

సెలవు సెలవు సెలవు కనుగొను కొత్త దీవి నీవు

సెలవు సెలవు సెలవు కనుగొను కొత్త దీవి నీవు


చిత్రం : జీన్స్ (1998)

రచన : ఎ.ఎం.రత్నం, శివగణేష్

సంగీతం : ఎ.ఆర్.రెహమాన్

గానం : ఎ.ఆర్.రెహమాన్, బృందం

No comments:

Post a Comment