Friday, April 1, 2011

Jayasimha (1955) - 1

పాట - 1
సాకీ :

అరెరెరెరెరె వినండి బాబూ

ఇదేనండి లోకం తీరూ

ఈ జనం పోకడా ఇదేనండీ

పల్లవి :

అరె నిసగమపా...లోకం మోసం పామగరిసా

అరె నిసగమపా... లోకం మోసం పామగరిసా

అనుపల్లవి :

మోసం మోసం అంటారంతా

మోసం మోసం అంటారంతా

మోసం చెయ్యని దెవ్వరంటా

నిసగమపా...

మోసం మోసం పామగరిసా

చరణం : 1

ఆయాసమంతా గ్రాసంకోసం

లోకం పలువేషం ఈ లోకం పలువేషం

జగమంతా బల్ మోసం

అరె నిసగమపా... లోకం మోసం పామగరిసా

చరణం : 2

మోసాలు చేసి మోక్షం కోరి

ఇచ్చే టెంకాయా దేవుడికిచ్చే టెంకాయా

అరె నిసగమపా... లోకం మోసం పామగరిసా

చరణం : 3

అడుక్కుతినటం మరిగినవాళ్ళ

కాళ్ళు కళ్ళూ కీళ్ళూ మోకాళ్ళూ కళ్ళూ కీ ళ్ళూ

వ్యాపారి వాడే తరాసుముల్లూ

తక్కెడలో రాళ్ళు అరె అంతా మోసం రా

జగమంతా వేషం రా

అరె నిసగమపా... లోకం మోసం పామగరిసా


చిత్రం : జయసింహ (1955)

రచన : సముద్రాల జానియర్

సంగీతం : టి.వి.రాజు

గానం : పిఠాపురం నాగేశ్వరరావు

No comments:

Post a Comment