Monday, April 4, 2011

Kalimilemulu (1962) - 1

పాట - 1
మల్లాది రామకృష్ణశాస్త్రి
పల్లవి :

గాలిలో... గాలిలో...

తేలే పూలడోలలో...డోలలో...

పన్నీరు జల్లే వెన్నెల తీవ కన్నుల కలకల ఏమో

చిననాటి ఆనందసీమలో...

అలనాటి ఆనందసీమలో

అదే చెలిమిగ విహరించేయమని

అనుకున్న కన్నె కలలే

చిననాటి ఆనందసీమలో...

చరణం : 1

గాలిలో... గాలిలో... అలారుగ... అలారుగ

గాలిలో అలలు అలలుగ అలారుగ

గానమేలే కనకవీణ

నగుమోమున తళతళ ఏమో

చిననాటి ఆనందసీమలో...

చరణం : 2

అలనాటి కలల వేడుకలే

మనసైన వాని చేరువచేయ

మోదములో ఆదమరచే పరవశమే

చిననాటి ఆనందసీమలో...

చరణం : 3

గగనాన వెలిగే రేరాజు

చెంగల్వకు కలకాలము చేరువె

ఆ పలుకే నిజమై ఆ మనసే తనదై

కన్నెవలపు మాయని పున్నమి వెలుగాయే

చిననాటి ఆనందసీమలో...


చిత్రం : కలిమిలేములు (1962)

రచన : మల్లాది రామకృష్ణశాస్త్రి

సంగీతం : అశ్వత్థామ

గానం : ఘంటసాల, ఎస్.జానకి

No comments:

Post a Comment