సిరిమల్లె పూవల్లె నవ్వు
చిన్నారి పాపల్లె నవ్వు
చిరకాల ముండాలి నీ నవ్వు
చిగురిస్తూ ఉండాలి నా నువ్వు... నా నువ్వు...
సిరిమల్లె పూవల్లె నవ్వు
చిన్నారి పాపల్లె నవ్వునవ్వు...
పనిసా హహ్హహ్హా సగమ హహ్హహ్హా గమప హహ్హహ్హా
నినిసపమ గమగమప హహ్హహ్హా
చరణం : 1
చిరుగాలి తరగల్లె మెలమెల్లగా
సెలయేటి నురుగల్లె తెలతెల్లగా
చిరుగాలి తరగల్లె మెలమెల్లగా
సెలయేటి నురుగల్లె తెలతెల్లగా
చిననాటి కలలల్లె తియతియ్యగా
ఎన్నెన్నో రాగాలు రవళించగా... రవళించగా...
సిరిమల్లె పూవల్లె నవ్వు
చిన్నారి పాపల్లె నవ్వు నవ్వు...
చరణం : 2
నీ పెదవిపై నవ్వులే కెంపుగా ఆ...
నీ కనులలో నవ్వు తెలిమెరుపుగా ఆ...
చెక్కిళ్లపై నవ్వు నునుసిగ్గుగా
చెక్కిళ్లపై నవ్వు నునుసిగ్గుగా
పరువాన్ని ఉడికించి ఉరికించగా... ఉరికించగా...
సిరిమల్లె పూవల్లె నవ్వు
చిన్నారి పాపల్లె నవ్వు నవ్వు...
చరణం : 3
నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా
ఆ వెలుగులో నేను పయనించగా
నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా
ఆ వెలుగులో నేను పయనించగా
వెలుగుతూ ఉంటాను నీ దివ్వెగా
వెలుగుతూ ఉంటాను నీ దివ్వెగా
నే మిగిలి ఉంటాను తొలినవ్వుగా... తొలినవ్వుగా...
సిరిమల్లె పూవల్లె నవ్వు
చిన్నారి పాపల్లె నవ్వు
చిరకాల ముండాలి నీ నవ్వు
చిగురిస్తూ ఉండాలి నా నువ్వు... నా నువ్వు...
సిరిమల్లె పూవల్లె నవ్వు
చిన్నారి పాపల్లె నవ్వు... నవ్వు...
చిత్రం : జ్యోతి (1976)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం: చక్రవర్తి
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి
No comments:
Post a Comment