Tuesday, April 5, 2011

Khadgam (2002) - 2

పాట - 1
పల్లవి :

నువ్వు... నువ్వు... నువ్వే నువ్వు

నువ్వు... నువ్వు... నువ్వూ...

నువ్వు... నువ్వు... నువ్వే నువ్వు

నువ్వు... నువ్వు... నువ్వూ...

నాలోనే నువ్వు నాతోనే నువ్వు

నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు

నా పెదవిపైన నువ్వు నా మెడవంపున నువ్వు

నా గుండె మీద నువ్వు నా ఒళ్ళంతా నువ్వు

బుగ్గల్లో నువ్వూ... మొగ్గల్లే నువ్వు ముద్దెసే నువ్వూ

నిద్దర్లో నువ్వూ... పొద్దుల్లో నువ్వు ప్రతి నిమిషం నువ్వూ

నువ్వు... నువ్వు... నువ్వే నువ్వు

నువ్వు... నువ్వు... నువ్వూ...

చరణం : 1

నా వయసునే వేధించే వెచ్చదనం నువ్వు

నా మనసును లాలించే చల్లదనం నువ్వు

పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు

బైట పడాలనిపించే పిచ్చిదనం నువ్వు

నా ప్రతి యుద్దం నువ్వూ నా సైన్యం నువ్వు

నా ప్రియ శత్రువు నువ్వూ... నువ్వూ...

మెత్తని ముల్లై గిల్లే తొలి చినుకే నువ్వు

నచ్చే కష్టం నువ్వూ... నువ్వూ...

నువ్వు... నువ్వు... నువ్వే నువ్వు

నువ్వు... నువ్వు... నువ్వూ...

చరణం : 2

నా సిగ్గును దాచుకునే కౌగిలివే నువ్వు

నా వన్నీ దోచుకునే కోరికవే నువ్వు

ముని పంటితొ నను గిచ్చే నేరానివి నువ్వు

నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు

తీరని దాహం నువ్వు నా మోహం నువ్వు

తప్పని స్నేహం నువ్వూ... నువ్వూ...

తీయని గాయం చేసే అన్యాయం నువ్వు

అయినా ఇష్టం నువ్వూ... నువ్వూ...

నువ్వు... నువ్వు... నువ్వే నువ్వు

నువ్వు... నువ్వు... నువ్వూ...

చరణం : 3

మైమరిపాస్తూ నువ్వు మురిపిస్తుంటే నువ్వు

నే కొరుకునే నా మరోజన్మ నువ్వు

కెపైక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు

నాకే తెలియని నా కొత్తపేరు నువ్వు

నా అందం నువ్వు ఆనందం నువ్వు

నేనంటే నువ్వూ...

నా పంతం నువ్వు నా సొంతం నువ్వు

నా అంతం నువ్వూ...

నువ్వు... నువ్వు... నువ్వే నువ్వు

నువ్వు... నువ్వు... నువ్వూ...

నువ్వు... నువ్వు... నువ్వే నువ్వు

నువ్వు... నువ్వు... నువ్వూ...


చిత్రం : ఖడ్గం (2002)

రచన : సిరివెన్నెల

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

గానం : సుమంగళి

----

పాట - 2

పల్లవి :

అహ అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయె

ఇహ మెల్లగ మెల్లగ ఎదలోన చిరుగిల్లుడు షురువాయె

అరె చెక్కిలి గిలిగిలి గింతాయె ఈ తిక్క గాలి వలన

మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయె ఈ రాతిరి దయ వలన

తాన్న దీన్నా తాన్న తన్నిన్నారే తళాంగు తక్కధిన్నా

అరె తాన్న దీన్నా తాన్న తన్నిన్నారే తళాంగు తక్క తక్కధిన్నా

చరణం : 1

బుగ్గే నిమురుకుంటే నాకు అరె మొటిమై తగులుతుంటదే

లేలేత నడుములోని మడత తన ముద్దుకై వేచివున్నదే

ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ తన తల్వారు కళ్ళలోన చిక్కుకున్నవే

మొత్తం నేలమీది మల్లెలన్నీ తన నవ్వుల్లో కుమ్మరిస్తడె

తాన్న దీన్నా తాన్న తన్నిన్నారే తళాంగు తక్కధిన్నా

అరె తాన్న దీన్నా తాన్న తన్నిన్నారే తళాంగు తక్క తక్కధిన్నా

చరణం : 2

పేరే పలుకుతుంటే చాలు నా పెదవే తీయగవుతదీ

కనుచూపే తాకుతుంటే నన్నూ అబ్బ నా మనసు పచ్చిగవుతదే

మెరిసే మెరుపల్లె వాడొస్తే అబ్బ నా గుండెలోన పిడుగు పడుతుంటదే

ఎదపై ఒక్కసారి హత్తుకుంటే ఇక నా ఊపిరాగిపోతదే

తాన్న దీన్నా తాన్న తన్నిన్నారే తళాంగు తక్కధిన్నా

అరె తాన్న దీన్నా తాన్న తన్నిన్నారే తళాంగు తక్క తక్కధిన్నా


చిత్రం : ఖడ్గం (2002)

రచన : సుద్దాల అశోకతేజ

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

గానం : చిత్ర , రఖీబ్, బృందం

No comments:

Post a Comment