Friday, April 1, 2011

Jeevana ragam (1986) - 1

పాట - 1
పల్లవి :

ఒక కొమ్మకు పూచిన పువ్వులం అనురాగం మనదేలే

ఒక గూటిని వెలిగిన దివ్వెలం మమకారం మనదేలే

చెల్లెమ్మా... నీవేను నా ప్రాణము

ఓ చెల్లెమ్మా... నీతోటిదే లోకము

ఒక కొమ్మకు పూచిన పువ్వులం అనురాగం మనదేలే

ఒక గూటిని వెలిగిన దివ్వెలం మమకారం మనదేలే

అన్నయ్యా... నీవేను నా ప్రాణము

ఓ అన్నయ్యా... నీతోటిదేలోకము

చరణం : 1

మా చెల్లి నవ్వు సిరిమల్లె పువ్వు

పలికించె నాలో రాగాల వీణ

మా అన్న చూపు మేఘాల మెరుపు

కురిపించె నాలో పన్నీటి వాన

ఇది కరగని చెరగని కలగా ఎద నిలిచెనులే కలకాలం

చిరునవ్వుల వెన్నెల సిరిగా చిగురించునులే చిరకాలం

ఈ బంధం సాగేను ఏనాటికీ

ఆ దైవం దీవించెను ముమ్మాటికీ

చరణం : 2

మా ఇంటి పంట చిన్నారి చెల్లి

మా కంటి పాప బంగారు తల్లి

ఈచోటవున్నా ఏచోటవున్నా ఎదలోన నిన్నే కొలిచేను అన్నా

మమకారం మనకే సొంతం విడరానిది ఈ అనుబంధం

ఈ అన్నకు నేనే చెల్లి కావాలి మళ్లి మళ్లి

ఈ బంధం సాగేను ఏనాటికీ

ఆ దైవం దీవించెను ముమ్మాటికీ

ఒక కొమ్మకు పూచిన పువ్వులం అనురాగం మనదేలే

ఒక గూటిని వెలిగిన దివ్వెలం మమకారం మనదేలే

చెల్లెమ్మా... నీవేను నా ప్రాణము

అన్నయ్యా... నీతోటిదేలోకము


చిత్రం : జీవనరాగం (1986)

రచన : ?

సంగీతం : సత్యం

గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల

No comments:

Post a Comment