Tuesday, April 5, 2011

Komaram puli (2010) - 3

పాట - 1

పల్లవి :

ఓ చెకుముకే ఓ చెకుముకే నువు చేరగ సరసకే

ఓ శశిముఖే ఓ శశిముఖే ఇక మీసం మొలిచెను మనసుకే... ఏ ఏ ఏ...

మహం మహ మాయె...

మహం మాయలిక మొదలాయెనే

మహం మహ మాయె ముహుర్తాలు ముదిరాయే

మహం మహ మాయె...

మహం మాయలిక మొదలాయెనే

మహం మహ మాయె ముహుర్తాలు ముదిరాయే

బహు తీయగ తీయగ తీయగ తీయగ తెరలను తీయగ

ఓహో చల్లగ చల్లగ చల్లగ చల్లగ విరులను చల్లగ

ఓ చెకుముకే ఓ చెకుముకే నువు చేరగ సరసకే

ఓ శశిముఖే ఓ శశిముఖే ఇక మీసం మొలిచెను మనసుకే... ఏ ఏ ఏ...

మహం మహ మాయె...

మహం మాయలిక మొదలాయెనే

మహం మహ మాయె ముహుర్తాలు ముదిరాయే

చరణం :

కాలికే మేఘాలు తగిలెనే

వే లికే గగనాలు వెలిగే

అంతరిక్షమంతరంగ మందువున్నది

పాలపుంత పూల సంత అయినది

ఊరించుతున్న స్వర్గమే

ఏరికోరుకుంటు వచ్చి ఇంటి పెరటిలో మూల నక్కుతున్నది

దైవమే చేరి కుర్ర జంట వెర్రి ముంచి ప్రేమ ప్రేమ మొక్కుతున్నది

అలాంటి హాయిదే అలాంటి హాయిదే

ఇలాంటి హాయి ఎక్కడున్నది

ఓ... ఓ... మళ్లీ పుట్టి మళ్లీ పెరిగి మళ్లీ చూసి

మళ్లీ కలసి మళ్లీ మెలసి

మళ్లీ మళ్లీ ప్రేమ కట్టి చచ్చి పుట్టి హో...

మళ్లీ నువ్వు మళ్లీ నేను మళ్లీ బాధ మళ్లీ ప్రేమ

మళ్లీ కొత్త రంగులద్ద అలుపురాదులే

మహం మహ మాయె...

మహం మాయలిక మొదలాయెనే

మహం మహ మాయె ముహుర్తాలు ముదిరాయే

మహం మహ మాయె...

మహం మాయలిక మొదలాయెనే

మహం మహ మాయె ముహుర్తాలు ముదిరాయే

బహు తీయగ తీయగ తీయగ తీయగ తెరలను తీయగ

ఓహో చల్లగ చల్లగ చల్లగ చల్లగ విరులను చల్లగ

బహు తీయగ తీయగ తీయగ తీయగ తెరలను తీయగ

ఓహో చల్లగ చల్లగ చల్లగ చల్లగ విరులను చల్లగ

ఓ చెకుముకే ఓ చెకుముకే నువు చేరగ సరసకే

ఓ శశిముఖే ఓ శశిముఖే ఇక మీసం మొలిచెను మనసుకే... ఏ ఏ ఏ...


చిత్రం : కొమరం పులి (2010)

రచన : చంద్రబోస్

సంగీతం : ఎ.ఆర్.రెహమాన్

గానం : జావేద్ అలీ, సుచిత్ర

----

పాట - 2

మారాలంటే లోకం... మారాలంటా నువ్వే...

వీచే గాలి అందరికోసం

వాన మేఘం దాచుకోదు తనకోసం

సూర్యకాంతి అందరికోసం

చంద్రజ్యోతి ఎరగదు ఏ స్వార్థం

ఒక్కరికైనా మేలు చేస్తే లోకం అంతా మేలు జరిగేను

ఒక్కరికైనా హాని చేస్తే లోకం అంతా హాని కలిగేను

మారాలంటే లోకం... మారాలంటా నువ్వే...

నువ్వంటే లోకం నీ వెంటే లోకం ఈ మాటే శ్లోకం సోదరా

నువ్వంటే లోకం నీ వెంటే లోకం ఈ మాటే శ్లోకం సోదరా

మా తెలుగుతల్లికి మల్లెపూదండ...

మా తెలుగుతల్లికి మల్లెపూదండ...

మారాలంటే లోకం... మారాలంటా నువ్వే...

వీచే గాలి అందరికోసం

వాన మేఘం దాచుకోదు తనకోసం

సూర్యకాంతి అందరికోసం

చంద్రజ్యోతి ఎరగదు ఏ స్వార్థం

ఒక్కరికైనా మేలు చేస్తే లోకం అంతా మేలు జరిగేను

ఒక్కరికైనా హాని చేస్తే లోకం అంతా హాని కలిగేను

సహనంలో గాంధీజీ... సమరంలో నేతాజీ...

సహనంలో గాంధీజీ... సమరంలో నేతాజీ...

మారాలంటే లోకం... మారాలంటా నువ్వే...

మా తెలుగుతల్లికి మల్లెపూదండ...

మా తెలుగుతల్లికి మల్లెపూదండ...


చిత్రం :కొమరం పులి (2010)

రచన :చంద్రబోస్

సంగీతం : ఎ.ఆర్.రెహమాన్

గానం : ఎ.ఆర్.రెహమాన్, బృందం

----

పాట - 3

పల్లవి :

నమ్మకమీయరా స్వామీ... నిర్భయమీయరా స్వామీ...

సన్మార్గమేదో చూపరా స్వామీ...

సుజ్ఞాన సూర్యుణ్ణి మాలో వెలిగించరా...

నమ్మకమీయరా స్వామీ... నిర్భయమీయరా స్వామీ...

సన్మార్గమేదో చూపరా స్వామీ...

సుజ్ఞాన సూర్యుణ్ణి మాలో వెలిగించరా...

చరణం : 1

చెడుకు ఎదురు పోరాడే...

మంచినెపుడు కాపాడే...

పిడుగు దేహమీయరా ప్రభూ...

ప్రేమతో పాటు పౌరుషం పంతం తేజం రాచగుణం

ప్రభూ... వినయం విలువలనీయరా...

నమ్మకమీయరా స్వామీ... నిర్భయమీయరా స్వామీ...

సన్మార్గమేదో చూపరా స్వామీ...

సుజ్ఞాన సూర్యుణ్ణి మాలో వెలిగించరా...

చరణం : 2

ఆ... ఆ... ఆ... ఆ.....

లోన నిజము గుర్తించే...

పైన భ్రమను గమనించే

సూక్ష్మ నేత్రమీయరా స్వామీ...

సర్వమందించు నీ ప్రియగానం స్మరణం ప్రార్థనకై

స్వామీ... సమయం స్వచ్ఛతనీయరా...

నమ్మకమీయరా స్వామీ... నిర్భయమీయరా స్వామీ...

సన్మార్గమేదో చూపరా స్వామీ...

సుజ్ఞాన సూర్యుణ్ణి మాలో వెలిగించరా...

నమ్మకమీయరా స్వామీ... నిర్భయమీయరా స్వామీ...

సన్మార్గమేదో చూపరా స్వామీ...

సుజ్ఞాన సూర్యుణ్ణి మాలో వెలిగించరా...


చిత్రం : కొమరం పులి (2010)

రచన : చంద్రబోస్

సంగీతం : ఎ.ఆర్.రెహమాన్

గానం : చిత్ర, మధుశ్రీ, హరిణి


No comments:

Post a Comment