Tuesday, April 5, 2011

Kokila (1989) - 1

పాట - 1
పల్లవి :

కోకిల కొక్కొ కోకిల... కూతలా రసగీతలా...

గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా

నీ పాటతో మరుపూదోటలో మది వేసింది మారాకిలా

ఐ లవ్ యు... ఏయ్ నువ్వు కాదురా

ఐ లవ్ యు... నేనురా

ఐ లవ్ యు ఐ లవ్ యు... ఐ లవ్ యు ఐ లవ్ యు...

చరణం : 1

జాబిల్లిలో మచ్చలే తెల్లబోయె నీ పాట వింటే

ఆకాశ దేశాన తారమ్మలాడే నీ కొమ్మ వాకిటే

చుక్కమ్మ కోపం... చీపో...

ముద్దొచ్చే రూపం... వదులు

కన్నుల్లో తాపం... హహాహా

వెన్నెల్లో దీపం... హోయ్ నాలోని లల్లాయికే

నీకింక జిల్లాయిలే

లయలేమో హొయలేమో ప్రియభామా కథలేమో

కోకిల కొక్కొ కోకిల... కూతలా రసగీతలా...

నీ పాటతో మరుపూదోటలో మది వేసింది మారాకిలా

గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా

ఐ లవ్ యు ఐ లవ్ యు... ఐ లవ్ యు ఐ లవ్ యు...

ఐ లవ్ యు ఐ లవ్ యు...

హే... కొమ్మ పండే రెమ్మ పండే

కొమ్మ పండే రెమ్మ పండే కొరుక్కుతింటావాకొమ్మ పండే రెమ్మ పండే కొరుక్కుతింటావా

బుగ్గ పండే సిగ్గు పండే

బుగ్గ పండే సిగ్గు పండే కొనుక్కుపోతావా

బుగ్గ పండే సిగ్గు పండే కొనుక్కుపోతావా

చరణం : 2

కొండల్లో వాగమ్మ కొంగర్లుపోయె నీ గాలి సోకి

ఈ ఛైత్రమాసాలు పూలారబోసే నీ లేత నవ్వుకే

పైటమ్మ జారే ప్రాణాలు తోడే

వయ్యారమంతా వర్ణాలు పాడే

జాలిగా నా జావళి...

హాలీడే పూజావళి...

ఇక చాలు సరసాలు కుదిరెను మురిపాలు

కోకిల కొక్కొ కోకిల... కూతలా రసగీతలా...

నీ పాటతో మరుపూదోటలో మది వేసింది మారాకిలా

ఐ లవ్ యు ఐ లవ్ యు... ఐ లవ్ యు ఐ లవ్ యు...

ఐ లవ్ యు... ఐ లవ్ యు...


చిత్రం : కోకిల (1989)

రచన : వేటూరి

సంగీతం : ఇళయరాజా

గానం : బాలు, చిత్ర, బృందం

No comments:

Post a Comment