పాట - 1
పి.సుశీల
పల్లవి :
గాలికి కులమేదీ... గాలికి కులమేదీ...
ఏదీ... నేలకు కులమేదీ...
గాలికి కులమేదీ... ఏదీ... నేలకు కులమేదీ...
గాలికి కులమేదీ...
మింటికి మరుగేదీ ఏదీ... మింటికి మరుగేదీ ఏదీ...
కాంతికి నెలవేదీ...
గాలికి కులమేదీ... ఏదీ... నేలకు కులమేదీ...
గాలికి కులమేదీ...
చరణం : 1
పాలకు ఒకటే... ఆ...
పాలకు ఒకటే తెలి వర్ణం
ఏదీ ప్రతిభకు కలదా ఫలభేదం
వీరులకెందుకు కులభేదం
అది మనసుల చీల్చెడు మతభేదం
గాలికి కులమేదీ... ఏదీ... నేలకు కులమేదీ...
గాలికి కులమేదీ...
చరణం : 2
జగమున యశమే...
జగమున యశమే మిగులునులే
అదీ యుగములకైనా చెదరదులే
దైవం నీలో నిలుచునులే
ధర్మం నీతో నడచునులే... ధర్మం నీతో నడచునులే
గాలికి కులమేదీ... ఏదీ... నేలకు కులమేదీ...
గాలికి కులమేదీ...
చిత్రం : కర్ణ (1964)
రచన : డా.సి.నారాయణరెడ్డి
సంగీతం: విశ్వనాథన్-రామ్మూర్తి
గానం : పి.సుశీల
No comments:
Post a Comment