సుడిగాలిలోన దీపం కడవరకు వెలుగునా...
సుడిగాలిలోన దీపం కడవరకు వెలుగునా...
సుడిగాలిలోన దీపం...
చరణం : 1
లోకాన పన్నీరు జల్లేవులే
నీకేమొ కన్నీరు మిగిలిందిలే
పెరవారి గాయాలు మాన్పేవులే
నీలోన పెనుగాయ మాయెనులే
నీలోన పెనుగాయ మాయెనులే
అణగారిపోవు ఆశ నీవల్లనె పలికే...
సుడిగాలిలోన దీపం కడవరకు వెలుగునా...
సుడిగాలిలోన దీపం...
చరణం : 2
ఒక కన్ను నవ్వేటివేళలో
ఒక కన్ను చెమరించసాగునా..
ఒక చోట రాగాలు వికసించునా
ఒక చోట రాగాలు వికసించునా
ఎనలేని ప్రాణదానం ఎద బాధ తీర్చునా..
సుడిగాలిలోన దీపం కడవరకు వెలుగునా...
సుడిగాలిలోన దీపం...
చరణం : 3
కల్లోల పవనాలు చెలరేగునా
గరళాల జడివాన కురిపించునా
అనుకోని చీకట్లు తెలవారునా
ఆనంద కిరణాలు ఉదయించునా
ఆనంద కిరణాలు ఉదయించునా
విధికేమొ లీల అయినా...
మది బరువు మోయునా..
సుడిగాలిలోన దీపం కడవరకు వెలుగునా...
సుడిగాలిలోన దీపం...
చిత్రం : జీవిత చక్రం (1971)
రచన : ఆరుద్ర
సంగీతం : శంకర్-జైకిషన్
గానం : ఘంటసాల
No comments:
Post a Comment