Monday, April 4, 2011

Kalavaramaye madilo (2009) - 1

పాట - 1
పల్లవి :

కనులే కలిపి కథలే తెలిపి నాలోని భావాలే

అలలై మెదిలే కలలే కదిపి వేవేల రాగాలే

పలికే స్వరాలే ఎదకే వరాలై

పదాలు పాడు వేళలో...

కలవరమాయే మదిలో...

కనులే కలిపి కథలే తెలిపి నాలోని భావాలే

అలలై మెదిలే కలలే కదిపి వేవేల రాగాలే

చరణం : 1

మనసున తొలి మధురిమలే వరించెనా

బతుకులో ఇలా సరిగమలే రచించెనా

స్వరము లేని గానం మరపురాని వైనం

మౌనవీణ మీటుతుంటే...

కలవరమాయే మదిలో...

చరణం : 2

ఎదగని కలే ఎదలయలో వరాలుగా

తెలుపని అదే తపనలనే తరాలుగా

నిదురపోని తీరం మధురమైన భారం

గుండెనూయలూపుతుంటే...

కలవరమాయే మదిలో...

కనులే కలిపి కథలే తెలిపి నాలోని భావాలే

అలలై మెదిలే కలలే కదిపి వేవేల రాగాలే

పలికే స్వరాలే ఎదకే వరాలై

పదాలు పాడు వేళలో...

కలవరమాయే మదిలో...


చిత్రం : కలవరమాయే మదిలో (2009)

రచన : వనమాలి

సంగీతం : శరత్ వాసుదేవన్

గానం : కె.ఎస్.చిత్ర

No comments:

Post a Comment