Tuesday, April 5, 2011

Karthika deepam (1979) - 1

పాట - 1
పల్లవి :

ఆ ఆ ఆ... ఆ ఆ ఆ...

ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం

చేరనీ నీ పాదపీఠం కర్పూరదీపం

ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం

చేరనీ నీ పాదపీఠం కర్పూరదీపం

ఇదే సుమా నా కుంకుమతిలకం

ఇదే సుమా నా మంగళసూత్రం

ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం

చేరనీ నీ పాదపీఠం కర్పూరదీపం

చరణం : 1

ఇంటిలోన నా పాపరూపున గోరంతదీపం

కంటికెదురుగా కనబడువేళల కొండంతదీపం

నా మనస్సులో వెలిగే దీపం

నా మనుగడ నడిపే దీపం

ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం

చేరనీ నీ పాదపీఠం కర్పూరదీపం

చరణం : 2

ఆకాశాన ఆ మణి దీపాలే ముతె్తైదువులుంచారో

ఈ కోనేట్లో ఈ చిరుదివ్వెల చూచి చుక్కలనుకుంటారో

ఏమైనా ఏదైనా కోవెలలో కొలువై యుండే

దేవికి పట్టిన హారతులే

ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం

చేరనీ నీ పాదపీఠం కర్పూరదీపం

చేరనీ నీ పాదపీఠం నా ప్రాణదీపం

చరణం : 3

నోచిన నోములు పండెనని ఈ ఆనందదీపం

నా దాచిన కోర్కెలు నిండునని ఈ ఆశాదీపం

నా నోచిన నోములు పండెనవి ఈ ఆనందదీపం

నా దాచిన కోర్కెలు నిండునని ఈ ఆశాదీపం

ఎచటైనా ఎప్పుడైనా నే కొలిచేకళ్యాణదీపం

నే వలచే నా ప్రాణదీపం

ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం

చేరనీ నీ పాదపీఠం కర్పూరదీపం

చేరనీ నీ పాదపీఠం నా ప్రాణదీపం


చిత్రం : కార్తీకదీపం (1979)

రచన : దేవులపల్లి కృష్ణశాస్ర్తి

సంగీతం : సత్యం

గానం : పి.సుశీల, ఎస్.జానకి

No comments:

Post a Comment