ఏ దివిలో విరిసిన పారిజాతమో...
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో...
నా మదిలో నీవై నిండిపోయెనే...
ఏ దివిలో విరిసిన పారిజాతమో...
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో...
నీ రూపమె దివ్య దీపమై
నీ నవ్వులె నవ్యతారలై
నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే ...
ఏ దివిలో విరిసిన పారిజాతమో...
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో..
చరణం : 1
పాలబుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే
నీలి ముంగురులు పిల్ల గాలితో ఆటలాడగా రావే
కాలి అందియలు ఘల్లుఘల్లుమన రాజహంసలా రావే
ఏ దివిలో విరిసిన పారిజాతమో...
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో...
చరణం : 2
నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించిన ది నీవే
పదము పదములో మధువులూరగా
పదము పదములో మధువులూరగా కావ్యకన్యవై రావే
ఏ దివిలో విరిసిన పారిజాతమో...
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో...
చిత్రం : కన్నెవయసు (1973)
రచన : దాశరథి
సంగీతం : సత్యం
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
No comments:
Post a Comment