గోరే గోరే గొగ్గోరే గోరే...గోరే గోరే గొగ్గోరే...
గోరే గోరే గొగ్గోరే గోరే... గోరే గొగ్గోరే గొగ్గోరే...
గో... గో... గో...
పొ పో పొమ్మంటోందా
నను రా రా రమ్మంటోందా
నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా
పొ పో పొమ్మంటోందా
నను రా రా రమ్మంటోందా
నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా
చూస్తు చూస్తూ సుడిగాలల్లే చుట్టేస్తుంటే నిలువెల్లా
ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా ఊపిరి ఆడక నీవల్లా
ఇదరా అదరా ఎద ఏమన్నా తెలిసే వీలుందా
గోరే గొగ్గోరే గోరే... గోరే గొగ్గోరే గొగ్గోరే...
గోరే గోరే గొగ్గోరే గోరే... గోరే గొగ్గోరే గొగ్గోరే...
చరణం : 1
తెగ ఉరుముతు కలకాలం తెరమరుగున తన భారం
మోసుకుంటూ తిరగదు మేఘం నీలా దాచుకోదుగా అనురాగం
తెగ ఉరుముతు కలకాలం తెరమరుగున తన భారం
మోసుకుంటూ తిరగదు మేఘం నీలా దాచుకోదుగా అనురాగం
ముళ్లుగా నాటితే నీ వ్యవహారం తుళ్ళీ పడదా నా సుకుమారం
మెల్లగా మీటితే నాలో మారం పలికుండేదే మమకారం
ఔనా అయినా నన్నే అంటావే నేరం నాదా గోరే...
గోరే గొగ్గోరే గోరే... గోరే గొగ్గోరే గొగ్గోరే...
గోరే గోరే గొగ్గోరే గోరే... గోరే గొగ్గోరే గొగ్గోరే...
చరణం : 2
వెంటపడుతుంటే వెర్రి కోపం నువు కంటబడకుంటే పిచ్చితాపం
మండిపడుతుందే హృదయం మరిచే మంత్రమైన చెప్పవే సమయం
వెంటపడుతుంటే వెర్రి కోపం నువు కంటబడకుంటే పిచ్చితాపం
మండిపడుతుందే హృదయం మరిచే మంత్రమైన చెప్పవే సమయం
నీతో నీకే నిత్యం ముద్ధం ఎందుకు చెప్పవె సత్యభామ
ఏం సాధిస్తుందే నీ పంతం ఒప్పుకుంటే తప్పులేదు ఉన్న ప్రేమ
తగువా మగువా నా పొగరంటే నీకిష్టం కాదా గోరే...
గోరే గొగ్గోరే గోరే... గోరే గొగ్గోరే గొగ్గోరే...
గోరే గోరే గొగ్గోరే గోరే... గోరే గొగ్గోరే గొగ్గోరే...
చిత్రం: కిక్ (2009)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఎస్.తమన్
గానం : కార్తీక్, జోత్స్న
----
పాట - 2
సాకీ :
ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే
ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే
ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే
ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే
పల్లవి :
అటు చూడొద్దన్నానా మాటాడొద్దన్నానా
ఒద్దొద్దు అంటే విన్నావంటే మనసా
ఏం పరవాలేదనుకున్నావేమో బహుశా
ఈ తలనొప్పేదైనా నీ తప్పేం లేదన్నా
అయ్యయ్యో అంటారేమో గాని మనసా
పడవలసిందేగా నువిలా నానా హింస
ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే
ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే
ప్రేమని కదిలించావే తోచీ తోచని తొలి వయసా
ఎందుకు బదులిచ్చావే తెలిసీ తెలియని పసి మనసా
అటు చూడొద్దన్నానా మాటాడొద్దన్నానా
ఒద్దొద్దు అంటే విన్నావంటే మనసా
ఏం పరవాలేదనుకున్నావేమో బహుశా
చరణం : 1
మునుపేనాడు ఏ కుర్రాడు పడలేదంటే నీ వెనకాల
వందలు వేలు ఉండుంటారు మతి చెడలేదే ఇలా వాళ్ళందరి వల్ల
ఎందుకివాళే ఇంత మంటెక్కిందో చెబుతావా
ఏం జరిగుంటుందంటే అడిగిన వాళ్ళని తిడతావా
అందరిలాగ వాణ్ణి వీదుల్లో వదిలేశావా
గుండెల గుమ్మం దాటి వస్తుంటే చూస్తున్నావా
అటు చూడొద్దన్నానా మాటాడొద్దన్నానా
ఒద్దొద్దు అంటే విన్నావంటే మనసా
ఏం పరవాలేదనుకున్నావేమో బహుశా
చరణం : 2
ఏ దారైనా ఏ వేళైనా ఎదురవుతుంటే నేరం తనదే
ఇంట్లో ఉన్నా నిదరోతున్నా కనిపిస్తుంటే ఆ చిత్రం నీలో ఉందే
ఎవ్వరినని ఏం లాభం ఎందుకు ఎద లయ తప్పిందే
ఎక్కడ ఉందో లోపం నీతో వయసేం చెప్పిందే
అలకో ఉలుకో పాపం ఒప్పుకునేందుకు ఇబ్బందే
తనకే నాకే కోపం కన్నెగ పుట్టిన నా మీదే
ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే
ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే
ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే
ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే
చిత్రం : కిక్ (2009)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఎస్.తమన్
గానం : కె.ఎస్.చిత్ర, కోరస్
No comments:
Post a Comment