పల్లవి :
మావిచిగురు తిని మీకు శుభమని మేలుకొలిపెను గండు కోయిల
మంచి కుబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయల
ఇంతలో తలపండగ...
ఇంటిలో తొలి పండుగ...
సింగారి సీతకు శీమంతమై
సరికొత్త ఆశల వసంతమై
మనసు మురిసిపోగా ఊఁ... ఊఁ...
మావిచిగురు తిని మీకు శుభమని మేలుకొలిపెను గండు కోయిల
మంచి కుబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయల
చరణం : 1
నీ గుండెలో అనురాగానికి ఒక బొమ్మ గీయనా
ఆ బొమ్మలో గల పాపాయికి జోజోలు పాడనా
మన క లలకి ఉదయమిదే అని తెలిపిన కిరణమిది
అణువణువును కలగలపే మన చెలిమికి సాక్ష్యమిది
మన గడిచిన ప్రతి నిమిషం కనులెదురుగ కనబడగా
పలికించనీ నవ నాదాలనీ పారాడనీపసి పాదాలనీ
మనసు మురిసిపోగా...
మావిచిగురు తిని మీకు శుభమని మేలుకొలిపెను గండు కోయిల
మంచి కుబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయల
చరణం : 2
వయ్యారివూహలు తియ్యంగ ఊదిన వేణునాదమో
చిన్నారి చిందుల పన్నీటి చినుకుల వాన గానమో
నీ సిగ్గుల సరిగమలో ఏ కులుకుల గమకమిది
నీ ముద్దుల మధురిమలో ఏ మమతల తమకమిది
మునుపెరుగని ప్రియలయలో శ్రుతి కలిపిన జత కథలో
సంసార వీణను సవరించగా సంతాన గీతిక రవళించగా
మనసు మురిసిపోగా....
మావిచిగురు తిని మీకు శుభమని మేలుకొలిపెను గండు కోయిల
మంచి కుబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయల
ఇంతలో తల పండగ...
ఇంటిలో తొలి పండుగ...
సింగారి సీతకు శీమంతమై
సరికొత్త ఆశల వసంతమై
మనసు మురిసిపోగా ఊఁ... ఊఁ...
చిత్రం : మావిచిగురు (1996)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి
గానం : ఎస్.పి.బాలు, చిత్ర
No comments:
Post a Comment