పల్లవి:
మాటరాని మౌనమిది... మౌన వీణ గానమిది
మాటరాని మౌనమిది... మౌన వీణ గానమిది
గానమిదినీ ధ్యానమిది
ధ్యానములో నా ప్రాణమిది
ప్రాణమైన మూగ గుండె రాగమిది
మాటరాని మౌనమిది... మౌన వీణ గానమిది
మాటరాని మౌనమిది... మౌన వీణ గానమిది
చరణం : 1
ముత్యాల పాటల్లో కోయిలమ్మా ముద్దారబోసేది ఎప్పుడమ్మా
ఆ పాల నవ్వులో వెన్నెలమ్మా దీపాలు పెట్టేది ఎన్నడమ్మా
ఈ మౌనరాగాల ప్రేమావేశం ఏనాడో ఒకరి సొంతం
ఆకాశ దీపాలు జాబిలి కోసం నీకేలా ఇంత పంతం
నింగీ నేల కూడే వేళ నీకూ నాకూ దూరాలేలా
అందరాని కొమ్మ ఇది కొమ్మ చాటు అందమిది
మాటరాని మౌనమిది... మౌన వీణ గానమిది
చరణం : 2
చైత్రాన కూసేను కోయిలమ్మా గ్రీష్మానికా పాట ఎందుకమ్మా
రేయంతా నవ్వేను వెన్నెలమ్మా నీరెండకా నవ్వు దేనికమ్మా
రాగాల తీగల్లో వీణానాదం కోరింది ప్రణయవేదం
వేసారు గుండెల్లో రేగె గాయం పాడింది మధురగేయం
ఆకాశాన తారాతీరం అంతేలేని ఎంతో దూరం
మాటరాని మౌనమిది... మౌన వీణ గానమిది
అందరాని కొమ్మ ఇది కొమ్మ చాటు అందమిది
కూడనిది జత కూడనది చూడనిది మది పాడనిది
చెప్పరాని చిక్కుముడి వీడనిది
మాటరాని మౌనమిది... మౌన వీణ గానమిది
అందరాని కొమ్మ ఇది కొమ్మ చాటు అందమిది
చిత్రం : మహర్షి (1988)
రచన : వెన్నెలకంటి
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి
----
పాట - 2
పల్లవి :
సుమం ప్రతి సుమం సుమం
వనం ప్రతి వనం వనం
సుమం ప్రతి సుమం సుమం
వనం ప్రతి వనం వనం
జగం అణువణువున కలకలహం
భానోదయాన చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం
వనం ప్రతి వనం వనం
చరణం : 1
ఆ... ఆ... ఆ...
వే ణువా వీణియా ఏమిటీ రాగము
వే ణువా వీణియా ఏమిటీ రాగము
అచంచలం సుఖం మధుర మధురం
మయం హృదం తరం గిరిజ సురతం
ఈ వేళ నాలో రాగోల్లసాలు
ఈ వేళ నాలో రాగోల్లసాలు
కాదు మనసా ప్రేమ మహిమా నాదు హృదయం
భానోదయాన చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం
వనం ప్రతి వనం వనం
చరణం : 2
ఆ... తా... ర...
రంగులే రంగులు అంబరానంతటా
రంగులే రంగులు అంబరానంతటా
స్వరం నిజం సగం వరము అమరం
వరం వరం వరం చెలియ ప్రణయం
ఆవేగమేదీ నాలోన లేదు
ఆవేగమేదీ నాలోన లేదు
ప్రేమమయమూ... ప్రేమమయమూ నాదు హృదయం
భానోదయాన చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం
వనం ప్రతి వనం వనం
సుమం ప్రతి సుమం సుమం
వనం ప్రతి వనం వనం
జగం అణువణువున కలకలహం
భానోదయాన చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం
వనం ప్రతి వనం వనం
చిత్రం : మహర్షి (1988)
రచన : నాయుని కృష్ణమూర్తి
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి
No comments:
Post a Comment