పల్లవి :
కైలాస శిఖరాన కొలువైన స్వామీ
నీ కంట పొంగేనా గంగమ్మ తల్లి
మనసున్న మంచోళ్ళే మారాజులు
మమతంటూ లేనోళ్ళే నిరుపేదలు
ప్రేమే నీ రూపం త్యాగం నీ ధర్మం
ఎవరే మి అనుకుంటే నీకేమిలే
రాజువయ్యా... మహరాజువయ్యా...
రాజువయ్యా... మహరాజువయ్యా...
చరణం : 1
కన్నీట తడిసినా కాలాలు మారవు
మనసారా నవ్వుకో పసిపాపల్లే
ప్రేమ కన్నా నిధులు లేవు
నీ కన్నా ఎవరయ్యా మారాజులు
నిన్నెవరు ఏమన్నా నీ దాసులు
జరిగినవి జరిగేవీ కలలే అనుకో
జరిగినవి జరిగేవీ కలలే అనుకో
రాజువయ్యా... మహరాజువయ్యా...
రాజువయ్యా... మహరాజువయ్యా...
చరణం : 2
త్యాగాల జీవితం తనవారికంకితం
మిగిలింది నీ నేను నా నువ్వేలే
దేవుడంటి భర్త ఉంటే
నాకన్నా ఎవరయ్యా మారాణులు
మనకున్న బంధాలే మాగాణులు
ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు
ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు
రాజువయ్యా... మహరాజువయ్యా...
రాజువయ్యా... మహరాజువయ్యా...
కైలాస శిఖరాన కొలువైన స్వామీ
నీ కంట పొంగేనా గంగమ్మ తల్లి
మనసున్న మంచోళ్ళే మారాజులు
మమతంటూ లేనోళ్ళే నిరుపేదలు
ప్రేమే నీ రూపం త్యాగం నీ ధర్మం
ఎవరే మి అనుకుంటే నీకేమిలే
రాజువయ్యా... మహరాజువయ్యా...
రాజువయ్యా... మహరాజువయ్యా...
చిత్రం : మహరాజు (1985)
రచన : వేటూరి
సంగీతం : చక్రవర్తి
గానం : పి.సుశీల
No comments:
Post a Comment