పల్లవి :
నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను నేను నువ్వు నువ్వు నేను లేనిచో ఈ జగమే లేదు
నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను నేను నువ్వు నువ్వు నేను లేనిచో ఈ జగమే లేదు
చరణం : 1
తీగల్లో నువ్వు నేనే అల్లుకొనేది
పూవుల్లో నువ్వు నేనే మురిసి విరిసేది
తీగల్లో నువ్వు నేనే అల్లుకొనేది
పూవుల్లో నువ్వు నేనే మురిసి విరిసేది
తెమ్మరలో మన మిద్దరమే పరిమిళించేది
తెమ్మరలో మన మిద్దరమే పరిమిళించేది
తేనెకు మన ముద్దులే తీపిని ఇచ్చేది తీపిని ఇచ్చేది
నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను నేను నువ్వు నువ్వు నేను లేనిచో ఈ జగమే లేదు
చరణం : 2
నువ్వు లేక వసంతానికి యవ్వనమెక్కడది
నువ్వు లేక వానమబ్బుకు మెరుపే ఎక్కడది
సృష్టిలోని అణువు అణువులో ఉన్నామిద్దరము
జీవితాన నువ్వే నేనై కలిసామిద్దరము
నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను నేను నువ్వు నువ్వు నేను లేనిచో ఈ జగమే లేదు
చరణం : 3
కొండల్లో నువ్వున్నావు నాకు అండగా
మంచల్లో నువ్వున్నావు నాకు నిండుగా
కొండల్లో నువ్వున్నావు నాకు అండగా
మంచల్లో నువ్వున్నావు నాకు నిండుగా
ఎన్ని జన్మలైనా ఉన్నాము తోడునీడగా
ఎన్ని జన్మలైనా ఉన్నాము తోడునీడగా
నిన్న నేడు రేపే లేని ప్రేమజంటగా ప్రేమజంటగా
నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను నేను నువ్వు నువ్వు నేను లేనిచో ఈ జగమే లేదు
చిత్రం : మంచి మనుషులు (1974)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల
No comments:
Post a Comment