Monday, May 30, 2011

Mangalya Balam (1959) - 2

పాట - 1

పల్లవి :

ఓ... ఓ.... ఓ... ఓ...ఓ...

ఆకాశవీధిలో... అందాల జాబిలీ...

వయ్యారి తారను జేరి

ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే...

ఆకాశవీధిలో... అందాల జాబిలీ...

వయ్యారి తారను జేరి

ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే...

చరణం : 1

జలతారు మేలి మబ్బు పరదాలు వేసి తెరచాటు చేసి...

పలుమారు దాగిదాగి పంతాలుపోయి పందాలు వేసి...

అందాల చందమామ దొంగాటలాడెనే దోబూచులాడెనే...

ఆకాశవీధిలో... అందాల జాబిలీ...

వయ్యారి తారను జేరి

ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే...

అ... అ... ఓ... ఓ... అ... అ... ఓ... ఓ...

చరణం : 2

జడివాన హోరుగాలి సుడిరేగి రానీ జడిపించబోనీ...

కలకాలం నీవే నేనని పలుబాసలాడి చెలిచెంతజేరి...

అందాల చందమామ అనురాగం చాటెనే నయరాగం చేసెనే...

ఆకాశవీధిలో... అందాల జాబిలీ...

వయ్యారి తారను జేరి

ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే...


చిత్రం : మాంగల్యబలం (1959)

రచన : శ్రీశ్రీ

సంగీతం : మాస్టర్ వేణు

గానం : ఘంటసాల, పి.సుశీల

----

పాట - 2

పల్లవి :

తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం

పరవశమై పాడేనా హృదయం

తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం

పరవశమై పాడేనా హృదయం

చరణం : 1

కల కల లాడెను వసంత వనము

మైమరిపించెను మలయా నిలము

కల కల లాడెను వసంత వనము

మైమరిపించెను మలయా నిలము

తీయని ఊహల ఊయల లూగి

తేలే మానసము... ఏమో...

తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం

చరణం : 2

రోజూ పూచే రోజా పూలు

ఒలికించినవి నవరాగాలు ఆ...

రోజూ పూచే రోజా పూలు

ఒలికించినవి నవరాగాలు ఆ...

పరిచయమైన కోయిల పాటే

కురిసే అనురాగం... ఏమో....

తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం

చరణం : 3

అరుణ కిరణముల గిలిగింతలలో

కరగిన తెలిమంచు తెరలే తరలి

అరుణ కిరణముల గిలిగింతలలో

కరగిన తెలిమంచు తెరలే తరలి

ఎరుగని వింతలు ఎదుటే నిలిచి

వెలుగే వికసించే... ఏమో...

తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం


చిత్రం : మాంగల్యబలం (1959)

రచన : శ్రీశ్రీ

సంగీతం : మాస్టర్ వేణు

గానం : పి.సుశీల

No comments:

Post a Comment