పల్లవి :
జడియకురా ధీరా... జడియకురా ధీరా...
సాత్విక రణ విజయము నీదేరా... జడియకురా ధీరా
ఈ పరాజయములన్నీ రేపటి జయ ఘోషలురా
ఈ పరాజయములన్నీ రేపటి జయ ఘోషలురా
పరపీడన చెర వీడక... భరతజాతి నిదురబోదు
పరపీడన చెర వీడక... భరతజాతి నిదురబోదు
జడియకురా ధీరా... జడియకురా ధీరా...
చరణం :
నమ్మిన చెలికాడు నచ్చిన బంటు
మహదేవ దేశాయి మారణమ్మైన
కలగెనా బాపూజీ కనులలో దీక్ష
సహధర్మచారిణి జగదేక పూజ్య
మాత కస్తూరిబా మాయమై చనిన
మరచెనా మానెనా మనసులో ప్రతిన
చిరునవ్వు మాసెనా వెనుకంజ వేసెనా
చిరునవ్వు మాసెనా వెనుకంజ వేసెనా
బాపూజీ మార్గమే భరతజాతికి దాస్య ముక్తి మార్గమ్మురా
భరతజాతికి దాస్య ముక్తి మార్గమ్మురా
చిరునవ్వు మాసెనా వెనుకంజ వేసెనా
బాపూజీ మార్గమే భరతజాతికి దాస్య ముక్తి మార్గమ్మురా
భరతజాతికి దాస్య ముక్తి మార్గమ్మురా.
చిత్రం : మనదేశం (1949)
రచన : సముద్రాల సీనియర్
సంగీతం : ఘంటసాల
గానం : నాగయ్య
----
పాట - 2
జయహో... జయహో...
మహాత్మగాంధీ జయ విజయీభవ భారతధాత్రీ
జైబోలో జైబోలో బోలో బోలో జైబోలో
స్వతంత్ర భారత నరనారీ
జైబోలో జైబోలో బోలో బోలో జైబోలో
స్వతంత్ర భారత నరనారీ
పరాధీనతా బంధ విమోచన
మహాపర్వ మీ శుభదినమూ
అభంగ స్వేచ్ఛా రణాంగణములో
సాహసానికిది ఫలమూ
జయహో... జయహో...
మహాత్మగాంధీ జయ విజయీభవ భారతధాత్రీ
స్వతంత్ర మానవ జాతులలో
మన మాటకు విలువా...
మనకొక జెండా లభించె నేటికి
ఇక ఏనాటికి మనదే మనదే
మనదే మనదే మనదేశం...
చిత్రం : మనదేశం (1949)
రచన : సముద్రాల సీనియర్
సంగీతం : ఘంటసాల
గానం : బృందగానం
----
పాట - 3
పల్లవి :
జయ జననీ పరమపావనీ
జయ జయ భారత జననీ
జయ జననీ పరమపావనీ
జయ జయ భారత జననీ
జయ జననీ పరమపావనీ
చరణం : 1
శీత శైలమణి శృంగకిరీటా
శీత శైలమణి శృంగకిరీటా
సింహళ జాంబూనదపీఠా
శీత శైలమణి శృంగకిరీటా
సింహళ జాంబూనదపీఠా
వింధ్య మహీధర మహామేఖల
వింధ్య మహీధర మహామేఖల
విమల కాశ్మీర కస్తూరి రేఖ
విమల కాశ్మీర కస్తూరి రేఖ
జయ జననీ పరమపావనీ
జయ జయ భారత జననీ
చరణం : 2
ఆ... ఆ... ఆ.....
గంగా సింధూ మహానది గౌతమి కృష్ణ కావేరి
గంగా సింధూ మహానది గౌతమి కృష్ణ కావేరి
జీవసార పరిపోషిత కోమల సస్యవిశాలా శ్యామలా
జీవసార పరిపోషిత కోమల సస్యవిశాలా శ్యామలా
సస్యవిశాలా శ్యామలా...
జయ జననీ పరమపావనీ
జయ జయ భారత జననీ
చిత్రం : మనదేశం (1949)
రచన : సముద్రాల సీనియర్
సంగీతం : ఘంటసాల
గానం : ఘంటసాల, కృష్ణవేణి, బృందం
----
పాట - 4
ఓహో... ఓహో...
భారతయువత! కదలరా
భారతయువత! కదలరా
నవయువ భారత విధాయకా
భారతయువత! కదలరా
మహాత్మాగాంధీకి జై
జవహర్‌లాల్ నెహ్రూకు జై
సర్దాల్ పటేల్‌కు జై
గాంధి జవహరు పటేలజాదు
మహారథులు మన నేతలురా
మహారథులు మన నేతలురా
గాంధి జవహరు పటేలజాదు
మహారథులు మన నేతలురా
భారతయువత! కదలరా
విజాతీయ పరిపాలన చెల్లని బజాయించరా ఢంకా
విజాతీయ పరిపాలన చెల్లని బజాయించరా ఢంకా
భారతయువత! కదలరా
ఆంధ్రకేసరికి జై
ఢిల్లీలో లాల్ ఖిల్లా పైన ఎగరవేయి నీ జెండా
ఆ... ఆ... ఆ... ఢిల్లీలో లాల్ ఖిల్లా పైన ఎగరవేయి నీ జెండా
ఎగరవేయి నీ జెండా
భారతయువత! కదలరా
డాక్టర్ పట్టాభికి జై
ఆచార్య రంగాకి జై
రాజాజీకి జై
హిందు ముస్లిం సిక్కు పారసీ క్రైస్తవులేకగళాన
హిందు ముస్లిం సిక్కు పారసీ క్రైస్తవులేకగళాన
మనదీ దేశం మనదేశమ్మని చాటింతమురా
దేశ దేశముల చాటింతమురా
దేశ దేశముల చాటింతమురా
చాటింతమురా...
భారతయువత! కదలరా
నవయువ భారత విధాయకా
భారతయువత! కదలరా
చిత్రం : మనదేశం (1949)
రచన : సముద్రాల సీనియర్
సంగీతం : ఘంటసాల
గానం : ఘంటసాల, కృష్ణవేణి, బృందం
No comments:
Post a Comment