Monday, May 30, 2011

Manchu pallaki (1982) - 2

పాట - 1

పల్లవి :

ఆ... ఆఆఆ... ఆఆఆ....

మేఘమా దేహమా... మెరవకే ఈ క్షణం

మెరిసినా కురిసినా... కరుగునే జీవనం...

మేఘమా దేహమా... మెరవకే ఈ క్షణం

మెరిసినా కురిసినా... కరుగునే...

మెరిసినా కురిసినా... కరుగునే జీవనం

మేఘమా దేహమా... మెరవకే ఈ క్షణం

చరణం : 1

మెరుపులతో పాటు ఉరుములుగా

దనిరిసా రిమ దనిస దనిసగా

మూగబోయే జీవ స్వరములుగా

వేకువ జామున వెన్నెల మరకలుగా

రేపటి వాకిట ముగ్గులుగా... ఆ...

స్మృతిలో మిగిలే నవ్వులుగా

వేసవిలో మంచుపల్లకిగా

మేఘమా దేహమా... మెరవకే ఈ క్షణం

మెరిసినా కురిసినా... కరుగునే జీవనం...

మేఘమా దేహమా... మెరవకే ఈ క్షణం

చరణం : 2

పెనుగాలికి పెళ్ళిచూపు

పువ్వు రాలిన వేళ కళ్యాణం

అందాక ఆరాటం... ఆశలతో పేరంటం

నాకొక పూమాల తేవాలి నువ్వు

నాకొక పూమాల తేవాలి నువ్వు

అది ఎందుకో... ఓ ఓ...

మేఘమా దేహమా... మెరవకే ఈ క్షణం

మెరిసినా కురిసినా... కరుగునే జీవనం...

మేఘమా దేహమా... మెరవకే ఈ క్షణం

చిత్రం : మంచు పల్లకి (1982)

రచన : వేటూరి

సంగీతం : రాజన్-నాగేంద్ర

గానం : ఎస్.జానకి

----

పాట - 2

పల్లవి :

నీ కోసమే మేమందరం నీ రాకకే ఈ సంబరం

మంచి తెస్తావని మంచి చేస్తావని

వెల్‌కమ్ వెల్‌కమ్ న్యూ ఇయర్ గుడ్‌బై ఓల్డ్ ఇయర్

వెల్‌కమ్ వెల్‌కమ్ న్యూ ఇయర్ గుడ్‌బై ఓల్డ్ ఇయర్

వచ్చె వచ్చె న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్

వచ్చె వచ్చె న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్

మా చెంత నిలిచి కన్నీరు తుడిచి సుఖశాంతులివ్వు తరతత్తత్త్తరం

చరణం : 1

ప్రతి డైరీలోను ప్రతి పేజీలోను

హాయిగా సాగిపో గురుతుగా ఉండిపో

చల్లగ దీవించు మా కోరిక మన్నించు

ఈ ఏటికన్న పై ఏడు మిన్న

పోయింది చేదు రావాలి తీపి హ్హ హ్హ హ్హ హ్హ

హేహేహే హ్యాపీ న్యూ ఇయర్

విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ గుడ్‌బై ఓల్డ్ ఇయర్

విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ గుడ్‌బై ఓల్డ్ ఇయర్

కొత్తకు ఎపుడు స్వాగతం పాతకో వందనం

కొత్తకు ఎపుడు స్వాగతం పాతకో వందనం

లాలాలలాల లాలాలలాల లాలాలలాల తరతత్తత్తరం

నీకోసమే మేమందరం నీరాకకే ఈ సంబరం

కొత్త సంవత్సరం గొప్ప శుభసూచకం

న్యూ ఇయర్ లాలాల లాలలల లాలలల్ల లాలలల్ల

న్యూ ఇయర్ లాలాల లాలలల లాలలల్ల లాలలల్ల

లాల్లలాల్లలాల్లల లాల్లలాల్లలాల్లల

తరత్త తరత్త తరత్త తరత్త...

లాలల్లలలా లాలలలా... లాలల్లలలా లాలలలా...

చరణం : 2

దొరికింది మాకు సరికొత్త స్నేహం

నేడు నీ రాకతో నిండు నీ నవ్వుతో

వెన్నెలై సాగిరా గుండెలో ఉండిపో

స్నేహాలు లేక ఏముంది జగతి

స్నేహాలలోనే దాగుంది ప్రగతి

హహహహా... ఎఏ... యా..

నీకోసమే మేమందరం నీ రాకకే ఈ సంబరం

కొత్త సంవత్సరం గొప్ప శుభసూచకం

వెల్‌కమ్ వెల్‌కమ్ న్యూ ఇయర్ గుడ్‌బై ఓల్డ్ ఇయర్

వెల్‌కమ్ వెల్‌కమ్ న్యూ ఇయర్ గుడ్‌బై ఓల్డ్ ఇయర్

కొత్తకు ఎపుడు స్వాగతం పాతకో వందనం

కొత్తకు ఎపుడు స్వాగతం పాతకో వందనం

లాలాలలాల లాలాలలాల లాలాలలాల తరతత్తత్తరం

లాలాలలాల లాలాలలాల లాలాలలాల తరతరత్తర హే య్యా..

చిత్రం : మంచు పల్లకి (1982)

రచన : గోపి

సంగీతం : రాజన్-నాగేంద్ర

గానం : ఎస్.పి.బాలు, బృందం


1 comment:

  1. Microtouch Titanium trim Reviews - TITanium-Art
    Microtouch Titanium trim titanium flashlight by TITanium-Art is a titanium pans modern version of the original T-Bone's classic. With a lighter lighter weight, the mens titanium wedding bands lighter it is $99.99 · ‎Out micro touch titanium trim where to buy of microtouch titanium trim stock

    ReplyDelete