Friday, May 27, 2011

Manavudu danavudu (1972) - 1

పాట - 1

పల్లవి :

అణువుఅణువున వెలసినదేవా

కనువెలుగై మము నడిపించరావా

అణువు అణువున వెలసినదేవా

చరణం : 1

మనిషిని మనిషే కరిచేవేళ

ద్వేషం విషమై కురిసేవేళ

నిప్పులు మింగి నిజమును తెలిపి

చల్లని మమతల సుధలను చిలికి

అమరజీవులై వెలిగినమూర్తుల

అమరజీవులై వెలిగినమూర్తుల

అమృతగుణం మాకందించరావా

అమృతగుణం మాకందించరావా

అణువు అణువున వెలసినదేవా

కనువెలుగై మము నడిపించరావా

అణువు అణువున వెలసినదేవా

చరణం : 2

జాతికి గ్రహణం పట్టినవేళ

మాతృభూమి మొరపెట్టినవేళ

స్వరాజ్య సమరం సాగించి

స్వాతంత్య్ర ఫలమును సాధించి

ధన్యచరితులై వెలిగిన మూర్తుల

ధన్యచరితులై వెలిగిన మూర్తుల

త్యాగనిరతి మాకందించరావా

త్యాగనిరతి మాకందించరావా

అణువు అణువున వెలసినదేవా

కనువెలుగై మము నడిపించరావా

అణువు అణువున వెలసినదేవా

చరణం : 3

వ్యాధులు బాధలు ముసిరేవేళ

మృత్యువు కోరలు సాచేవేళ

గుండెకు బదులుగ గుండెను పొదిగి

కొన ఊపిరులకు ఊపిరులూది

జీవనదాతలై వెలిగిన మూర్తుల

జీవనదాతలై వెలిగిన మూర్తుల

సేవాగుణం మాకందించరావా

సేవాగుణం మాకందించరావా

అణువు అణువున వెలసినదేవా

కనువెలుగై మము నడిపించరావా

అణువు అణువున వెలసినదేవా


చిత్రం : మానవుడు-దానవుడు (1972)

రచన : డా.సి.నారాయణరెడ్డి

సంగీతం : అశ్వత్థామ

గానం : ఎస్.పి.బాలు, బృందం

No comments:

Post a Comment