సాకీ :
గంగా శంకాశ కావేరి శ్రీరంగేశ మనోహరి
కల్యాణకారి కలుషారి నమస్తేస్తు సుధాఝరి
పల్లవి :
శ్రీరంగ రంగనాథుని దివ్యరూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే
శ్రీరంగ రంగనాథుని దివ్యరూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే
నీలవేణిలో నీటిముత్యాలు కృష్టవేణిలో అలల గీతాలు
నీలవేణిలో నీటిముత్యాలు నీరజాక్షునికి పూలుగా
కృష్టవేణిలో అలల గీతాలు కృష్ణగీతలే పాడగా
శ్రీరంగ రంగనాథుని దివ్యరూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే
చరణం : 1
కృష్ణాతీరాన అమరావతిలో
శిల్పకళావాణి పలికిన శ్రుతిలో
అలలైపొంగేను జీవనవేదం
కలలే పలికించు మధుసంగీతం
చల్లగా గాలి పల్లకీలోన పాట ఊరేగగా
వెల్లువై గుండె పల్లె పదమల్లి పల్లవే పాడగా
శ్రీత్యాగరాజ కీర్తనై సాగే తీయని జీవితం
శ్రీరంగ రంగనాథుని దివ్యరూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే
నీలవేణిలో నీటిముత్యాలు నీరజాక్షునికి పూలుగా
కృష్టవేణిలో అలల గీతాలు కృష్ణగీతలే పాడగా
శ్రీరంగ రంగనాథుని దివ్యరూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే
చరణం : 2
గంగను మరపించు ఈ కృష్ణవేణి
వెలుగులు ప్రవహించు తెలుగింటి రాణి
పాపాల హరియించు పావన జలము
పచ్చగ ఈ నేల పండించు ఫలము
ఈ ఏటి నీటి పాయలే తేటగీతులే పాడగా
సిరులెన్నో పండి ఈ భువి స్వర్గలోకమై మారగా
కల్లకపటమే కానరాని ఈ పల్లెసీమలో
శ్రీరంగ రంగనాథుని దివ్యరూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే
నీలవేణిలో నీటిముత్యాలు నీరజాక్షునికి పూలుగా
కృష్టవేణిలో అలల గీతాలు కృష్ణగీతలే పాడగా
శ్రీరంగ రంగనాథుని దివ్యరూపమే చూడవే
శ్రీరంగ రంగనాథుని దివ్యరూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే
చిత్రం : మహానది (1994)
రచన : వెన్నెలకంటి
సంగీతం : ఇళయరాజా
గానం : బాలు, చిత్ర, బృందం
No comments:
Post a Comment