Friday, May 27, 2011

Manchi manasulu (1962) - 2


పాట - 1

పల్లవి :

నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే

పూవులేక తావి నిలువలేదులే లేదులే

నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే

పూవులేక తావి నిలువలేదులే లేదులే

తావిలేని పూవు విలువ లేనిదే ఇది నిజములే

నేను లేని నీవు లేనె లేవులే లేవులే

తావిలేని పూవు విలువ లేనిదే ఇది నిజములే

నేను లేని నీవు లేనె లేవులే లేవులే

చరణం : 1

నా మనసే చిక్కుకొని నీ చూపుల వలలో

నా వయసు నా సొగసు నిండెను నీమదిలో

నా మనసే చిక్కుకొని నీ చూపుల వలలో

నా వయసు నా సొగసు నిండెను నీమదిలో

చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె

చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె

దూరదూర తీరాలు చేరువైపోయె

ఓ... తావిలేని పూవు విలువ లేనిదే ఇది నిజములే

నేను లేని నీవు లేనె లేవులే లేవులే

చరణం : 2

సిగ్గుతెరలలో కనులు దించుకొని తలను వంచుకొని

బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ

సిగ్గుతెరలలో కనులు దించుకొని తలను వంచుకొని

బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ

రంగులీను నీమెడలో బంగారపు తాళిగట్టి

పొంగిపోవు శుభదినము రానున్నదిలే

ఓ... నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే

పూవులేక తావి నిలువలేదులే లేదులే

చరణం : 3

తొలినాటి రేయి తడబాటు పడుతూ

మెలమెల్లగా నీవు రాగ

నీ మేని హొయలు నీలోని వగలు

నాలోన గిలిగింతలిడగా

హృదయాలు కలసి ఉయ్యాలలూగి

ఆకాశమే అందుకొనగా

పైపైకి సాగే మేఘాలదాటి

కనరాని లోకాలు కనగా

ఆహా ఓహో ఉహు ఆ... ఓ...

నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే

నీవులేని నేను లేనె లేనులే లేనులే

నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే

నీవులేని నేను లేనె లేనులే లేనులే


చిత్రం : మంచిమనసులు (1962)

రచన : దాశరథి

సంగీతం : కె.వి.మహదేవన్

గానం : ఘంటసాల, పి.సుశీల

----

పాట - 2

సాకీ :

అహో! ఆంధ్రభోజా! శ్రీకృష్ణదేవరాయా!

విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజోవిరాజా!

ఈ శిథిలాలలో చిరంజీవి వైనావయా!

పల్లవి :

శిలలపై శిల్పాలు చెక్కినారు

శిలలపై శిల్పాలు చెక్కినారు

నవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు

శిలలపై శిల్పాలు చెక్కినారు

చరణం : 1

కనుచూపు కరువైన వారికైనా

కనుచూపు కరువైన వారికైనా

కనుపించి కనువిందు కలిగించు రీతిగా

శిలలపై శిల్పాలు చెక్కినారు

చరణం : 2

ఒకవైపు ఉర్రూతలూపు కవనాలు

ఒక ప్రక్క ఉరికించు యుద్ధ భేరీలు

ఒక చెంప శృంగారమొలుకు నాట్యాలు

నవరసాలొలికించు నగరాని కొచ్చాము

కనులు లేవని నీవు కలతపడవలదు

కనులు లేవని నీవు కలతపడవలదు

నా కనులు నీవిగా చేసుకొని చూడు

శిలలపై శిల్పాలు చెక్కినారు

నవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు

శిలలపై శిల్పాలు చెక్కినారు

చరణం : 2

ఏకశిల రథముపై లోకేశు వడిలోన

ఓరచూపులదేవి ఊరేగి రాగా

ఏకశిల రథముపై లోకేశు వడిలోన

ఓరచూపులదేవి ఊరేగి రాగా

రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి

సరిగమా పదనిసా స్వరములే పాడగా

కొంగు ముడివేసుకుని క్రొత్త దంపతులు

కొంగు ముడివేసుకుని క్రొత్త దంపతులు

కొడుకు పుట్టాలని కోరుకున్నారని

శిలలపై శిల్పాలు చెక్కినారు

నవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు

శిలలపై శిల్పాలు చెక్కినారు

చరణం : 3

రాజులే పోయినా రాజ్యాలు కూలినా

కాలాలు మారినా గాడ్పులే వీచినా

నుజులే దనుజులై మట్టిపాల్జేసినా ఆ...

చెదరనీ కదలనీ శిల్పాలవలెనే

నీవు నా హృదయాన నిత్యమై సత్యమై

నిలిచివుందువు చెలీ నిజము నా జాబిలీ


చిత్రం : మంచిమనసులు (1962)

రచన : ఆచార్య ఆత్రేయ

సంగీతం : కె.వి.మహదేవన్

గానం : ఘంటసాల

No comments:

Post a Comment