Monday, May 30, 2011

Manmadhudu (2003) - 3

పాట - 1

పల్లవి :

నా మనసునే మీటకే నేస్తమా

నా దారిలో చేరకే చైత్రమా

సరదాల చిలిపితనమా చిరునవ్వులోని స్వరమా

నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమ

నా మనసునే మీటకే నేస్తమా

నా దారిలో చేరకే చైత్రమా

చరణం : 1

నాకెందుకిలా ఔతోంది చెప్పవా ఒక్కసారి

నీ వెంటపడే ఆశలకి చూపవా పూలదారి

చినుకల్లే చేరి వరదల్లే మారి ముంచే స్తె తేలేదెలాగ

తడి జాడలేని తమ గుండెలోని దాహాలు తీరేదెలాగ

లేనిపోని సయ్యాటతో వెంటాడకే ప్రేమ

నీ కనులలో వెలగనీ ప్రియతమా

నీ పెదవికీ తెలుపనీ మధురిమ

చరణం : 2

నీ ఊహలలో కొంటెతనం పలకరిస్తోంది నన్ను

నీ ఊపిరితో అల్లుకుని పులకరిస్తోంది వెన్ను

అలవాటు పడిన ఎద చీకటింత సరికొత్త వేకువై రావా

కిరణాలు పడని తెరచాటులోని ఏకాంతమే వదులుకోవా

నన్ను నేను మరిచేంతలా మురిపించకే ప్రేమ

నీ కనులలో వెలగనీ ప్రియతమా

నీ పెదవికీ తెలుపనీ మధురిమ

సరదాల చిలిపితనమా చిరునవ్వులోని స్వరమా

నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమ


చిత్రం : మన్మథుడు (2003)

రచన : సిరివెన్నెల

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

గానం : ఎస్.పి.బాలు, చిత్ర

----

పాట - 2


పల్లవి :

గుండెల్లో ఏముందోకళ్ళల్లో తెలుస్తుంది

పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది

నిలవదు కద హృదయం... నువు ఎదురుగ నిలబడితే

కదలదు కద సమయం... నీ అలికిడి వినకుంటే

కలవరమో తొలివరమో తీయని తరుణమిది!

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది

పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది

మనసా మనసా మనసా మనసా మనసా మనసా

మనసా మనసా మనసా ఓ మనసా..!

చరణం : 1

పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది

నువ్వు ఇపుడన్నది నేనెప్పుడూ విననిది

నిన్నిలా చూసి పయనించి... వెన్నెలే చిన్నబోతోంది

కన్నులే దాటి కలలన్నీ... ఎదురుగా వచ్చినట్టుంది

ఏమో... ఇదంతా... నిజంగా కలలాగే ఉంది!

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది

పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది

చరణం : 2

ఎందుకో తెలియని కంగారు పడుతున్నది

ఎక్కడా జరగని వింతేమి కాదే ఇది

పరిమళం వెంట పయనించి... పరుగు తడబాటు పడుతోంది

పరిణయం దాక నడిపించీ... పరిచయం తోడు కోరింది

దూరం తలొంచే ముహూర్తం ఇంకెపుడొస్తుంది!

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది

పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది

నిలవదు కద హృదయం... నువు ఎదురుగ నిలబడితే

కదలదు కద సమయం... నీ అలికిడి వినకుంటే

కలవరమో తొలివరమో తీయని తరుణమిది!

మనసా మనసా మనసా మనసా మనసా మనసా

మనసా మనసా మనసా ఓ మనసా..!


చిత్రం : మన్మథుడు (2003)

రచన : సిరివెన్నెల

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

గానం : వేణు, సుమంగళి

----

పాట - 3

పల్లవి :

నేను నేనుగా లేనే నిన్న మెున్నలా

లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా

ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా

ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా

నేను నేనుగా లేనే నిన్న మెున్నలా

లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా

ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా

ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా

చరణం : 1

పూలచెట్టు ఊగినట్టు పాలబొట్టు చిందినట్టు

అల్లుకుంది నా చుట్టూ ఓ చిరునవ్వు

తేనెపట్టు రేగినట్టు వీణమెట్టు ఒణికినట్టు

ఝల్లువుంది గుండెల్లో ఎవరేనువ్వు..

నా వునసుని మైవురపున వుుంచిన ఆ వాన

మీకెవరికీ కనిపించదు ఏమైనా... ఓ ఓ...

నేను నేనుగా లేనే నిన్న మెున్నలా

లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా

ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా

ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా

చరణం : 2

చుట్టు పక్కలెందరున్నా గుర్తుపట్టలేక ఉన్నా

అంతవుంది ఒక్కలాగే కనబడుతుంటే

తప్పునాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా

చెప్పలేను నిజమేదో నాకూ వింతే

కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో

చెప్పవా కనురెప్పలకే వూటొస్తే... ఓ ఓ...

నేను నేనుగా లేనే నిన్న మెున్నలా

లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా

ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా

ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా


చిత్రం : మన్మథుడు (2003)

రచన : సిరివెన్నెల

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

గానం : ఎస్.పి.చరణ్

No comments:

Post a Comment