పల్లవి :
విధి చేయు వింతలన్నీ
మతిలేని చేతలేనని విరహాన వేగిపోయి
విలపించే కథలు ఎన్నో
విధి చేయు వింతలన్నీ
మతిలేని చేతలేనని విరహాన వేగిపోయి
విలపించే కథలు ఎన్నో
చరణం : 1
ఎదురుచూపులో ఎదను పిండగ
ఏళ్ళు గడిపెను శకుంతల
విరహ బాధను మరచిపోవగ
నిదురపోయెను ఊర్మిళ
ఎదురుచూపులో ఎదను పిండగ
ఏళ్ళు గడిపెను శకుంతల
విరహ బాధను మరచిపోవగ
నిదురపోయెను ఊర్మిళ
అనురాగమే నిజమని
మనసొకటే దాని ఋజువని
తుది జయము ప్రేమదేనని
బలియైనవి బ్రతుకులెన్నో
విధి చేయు వింతలన్నీ...
చరణం : 2
వలచి గెలిచీ కలలు పండిన
జంట లేదీ ఇలలో
కులము మతమో ధనము బలమో
గొంతు కోసెను తుదిలో
అది నేడు జరుగరాదని
ఎడబాసి వేచినాము
మనగాథే యువతరాలకు
కావాలి మరో చరిత్ర కావాలి మరో చరిత్ర
విధి చేయు వింతలన్నీ
మతిలేని చేతలేనని విరహాన వేగిపోయి
విలపించే కథలు ఎన్నో విలపించే కథలు ఎన్నో
చిత్రం : మరోచరిత్ర (1978)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్
గానం : వాణీజయరాం
----
పాట - 2
పల్లవి :
ఏ తీగపూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుబంధమౌనో
అప్పిడన్న... అర్థం కాలేదా
ఏ తీగపూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో
చరణం : 1
మనసు మూగది మాటలు రానిది
మమత ఒకటే అది నేర్చినది
ఆహా అప్పడియ... పెద్ద అర్థం అయినట్టు
భాషలేనిది బంధమున్నది
మన ఇద్దరిని జత కూర్చినది
మన ఇద్దరిని జత కూర్చినది
ఏ తీగపూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో
చరణం : 2
వయసే వయసును పలకరించినది
వలదన్నా అది నిలువకున్నది
ఏ నీ రొంబ అలహారిక్కే ఆ రొంబ అంటే
ఎల్లలు ఏవి ఒల్లలన్నది
నీది నాదోక లోకం అన్నది
నీది నాదోక లోకం అన్నది
ఏ తీగపూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో
చరణం : 3
తొలి చూపే నను నిలవేసినది
మరుమాపై అది కలవరించినది
నల్ల పొన్ను అంటే నల్ల పిల్ల
మొదటి కలయికే ముడివేసినది
తుది దాక ఇది నిలకడైనది
తుది దాక ఇది నిలకడైనది
ఏ తీగపూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో
చిత్రం : మరోచరిత్ర (1978)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్
గానం : పి.సుశీల, కమల్‌హాసన్
No comments:
Post a Comment